NTR: ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది.. ఇప్పుడు `బ్రహ్మాస్త్ర` పరిస్థితి ఏంటో?

First Published Sep 2, 2022, 9:05 PM IST

భారీ పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన `బ్రహ్మాస్త్ర` విడుదలకు దగ్గరపడుతుంది. సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేసేందుకు ఎన్టీఆర్‌ గెస్ట్ గా భారీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేసింది  చిత్ర బృందం. కానీ ఆశలన్నీ గల్లంతయ్యాయి. 

పాన్‌ ఇండియా చిత్రాల జోరు సాగుతుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌` చిత్రాలు ఇండియా వైడ్‌గా సంచలనాలు క్రియేట్‌ చేశాయి. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి బడ్జెట్‌తో, భారీ స్కేల్‌తో రూపొందిన బాలీవుడ్‌ సినిమా `బ్రహ్మాస్త్ర` (Brahmastra) రాబోతుంది. పురాణాల ఆధారంగా, సూపర్‌ పవర్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. రణ్‌ బీర్‌ కపూర్‌(RanBir), అలియాభట్‌(Alia Bhatt), నాగార్జున, అమితాబ్‌ బచ్చన్, మౌనీ రాయ్‌ వంటి భారీ తారాగణం నటించారు. విజువల్‌ వండర్‌గా దీన్ని తెరకెక్కించారు. 
 

`బ్రహ్మాస్త్ర` ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. డిస్నీ సంస్థ అత్యధిక థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్‌ చేయబోతుంది. అన్ని భారీగా ఉన్నప్పటికీ ఈ సినిమాకి మాత్రం ఆ స్థాయి బజ్‌ లేకపోవడం గమనార్హం. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌2` వంటి సినిమాలకు క్రియేట్‌ అయినంత బజ్‌ `బ్రహ్మస్ర్త`కి రావడం లేదు. రాజమౌళి భాగమైనా ఫలితం లేదు. దీంతో ఎన్టీఆర్‌ని నమ్ముకుంది చిత్ర బృందం. 
 

ఎన్టీఆర్‌(NTR) గెస్ట్ గా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. వేల మంది ఈ ఈవెంట్‌కి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో సినిమాపై ఒక్కసారిగా హైప్‌ పెరుగుతుంది. అదే హైప్‌ని కంటిన్యూ చేస్తూ ఇండియాలోని ప్రధాన నగరాల్లో ప్రెస్‌ కాన్ఫరెన్స్ లు పెడితే మరింత బజ్‌ క్రియేట్‌ చేయోచ్చని రాజమౌళి భావించారు. అందుకు ఎన్టీఆర్‌ని రంగంలోకి దించగా, ఆయన ఓకే చెప్పారు. 

కానీ ఉన్నట్టుండి చివరి నిమిషంలో `బ్రహ్మాస్త్ర` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని క్యాన్సిల్‌ చేసింది యూనిట్‌. భారీ క్రౌడ్‌ని కంట్రోల్‌చేయడం కష్టమని, ప్రస్తుతం తమ వద్ద అంత పోలీస్‌ ఫోర్స్ లేదని పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈవెంట్‌ క్యాన్సిల్‌ అయ్యింది. ఎన్టీఆర్‌పై పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యాయి. ఎన్టీఆర్‌(Jr NTR) ని చూసేందుకు వచ్చిన అభిమానులకు పెద్ద షాకిచ్చినట్టయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో అభిమానులు కదిలి వస్తున్నారు. కార్లు, బసు, మోటార్‌ బైక్‌లపై భారీగా కదిలి వస్తున్న సమయంలో ఈవెంట్‌ క్యాన్సిల్‌ అనే వార్తతో వారంతా నిరాశలోకి,అసహనంలోకి వెళ్లిపోయారు. నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు ఇది `బ్రహ్మాస్త్ర` సినిమాపై కూడా పెద్ద ప్రభావం చూపబోతుంది.వేల మంది అభిమానుల మధ్య సినిమాని జనంలోకి తీసుకెళ్లాలని భావించిన చిత్ర బృందం ఆశలన్నీ ఇప్పుడు గల్లంతయ్యాయి. అసలే సినిమాపై ఎలా చేసినా బజ్‌ రావడం లేదు. పైగా బాలీవుడ్‌లో `బాయ్‌కాట్‌ బ్రహ్మాస్త్ర` అంటూ యాష్‌ ట్యాగ్‌లను ట్రెండ్‌ చేస్తున్నారు. అక్కడ ఏ ఒక్క బాలీవుడ్‌సినిమాని ఎంకరేజ్‌ చేయడం లేదు. అన్నింటిపై బాయ్‌కాట్‌ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. రణ్‌బీర్‌, అలియా, నాగ్‌, రాజమౌళి ఉన్నా ఏం చేయలేకపోతున్నారు. దీంతో ఇప్పుడు సినిమాపై హైప్‌ తెచ్చేందుకు ఏ ఒక్క ఆప్షన్‌ లేదు. 

ఈ క్రమంలో ఉన్న ఒకే ఒక్క ఆశ ఎన్టీఆర్‌. ఆయన కూడా ఇప్పుడు అభిమానులను కలిసే పరిస్థితి లేదు. దీంతో ఆ ఆశ కూడా పోయింది. ఇప్పుడు `బ్రహ్మస్త్ర`ని ఎవరు కాపాడతారు, ఆ సినిమా పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక సినిమా థియేటర్లలో ఆడియెన్స్ ముందే తేల్చుకోవాల్సిందే. పాజిటివ్‌ టాక్‌ వస్తే ఓకే, లేదంటే అడ్రస్‌ గల్లంతు కావడం ఖాయమంటున్నారు. 
 

click me!