మరోవైపు కల్కి 2, సలార్ 2 సీక్వెల్స్ లో కూడా ప్రభాస్ నటించాల్సి ఉంది. వీటి పరిస్థితి ఏంటో ఇప్పుడే తేలదు. అయితే ఓ పాన్ ఇండియా డైరెక్టర్ మాత్రం ప్రభాస్ అభిమానులకు షాకిచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభాస్ అభిమానులు కల్కి 2 చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కల్కి 2లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు ? డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ ని పూర్తి స్థాయిలో కర్ణుడిగా చూపిస్తాడా ? ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం ఫ్యాన్స్ కల్కి 2 కోసం ఎదురు చూస్తున్నారు. ల్కి మొదటి భాగం పాన్ ఇండియా వైడ్ గా 1100 కోట్లు రాబట్టింది. కల్కి 2 ఇంకా భారీగా ఉండబోతోంది.