బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్ లో అలియా భట్ తన ప్రియుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది.
అలియా రణబీర్ జంటకి కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అలియా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ నే సినిమాలు కూడా మొదలు పెట్టేసింది. అలియా భట్ తల్లి కాక ముందు ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర చిత్రాల్లో నటించింది.
అలియా నటించిన చివరి రెండు చిత్రాలు అవే. ఇప్పుడు తల్లి అయిన తర్వాత అలియా రీఎంట్రీ మూవీ వచ్చేసింది. రణ్వీర్ సింగ్ కి జోడిగా నటించిన కుటుంబ కథా చిత్రం రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని చిత్రం జూలై 28న థియేటర్స్ లోకి వచ్చింది.
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రణ్వీర్ సింగ్, అలియా భట్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయినట్లు చెబుతున్నారు. దీనితో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయమే అందుకుంది.
ఈ చిత్రంలో జయ బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీ లాంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రాన్ని మంచి ఆదరణ లభించింది.
అలియా భట్ పెళ్లి తర్వాత కూడా మాత్రం తగ్గడం లేదు. క్రేజీ ఆఫర్స్ తో స్టార్ బ్యూటీగా బాలీవుడ్ లో హవా కొనసాగిస్తోంది. దీనితో అలియా భట్ గ్లామర్ ని, నటనని ప్రేక్షకులు సిల్వర్ స్క్రీన్ పై ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా అలియా భట్ అంబానీ ఇంట్లో గణేష్ సెలబ్రేషన్స్ లో పాల్గొంది. ఎరుపెక్కిన ఆకాశాన్ని చీరగా కట్టుకున్నట్లు అలియా భట్ మెరుపులు మెరిపిస్తోంది. ఆమె సొగసు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అంటే అతిశయోక్తి కాదు.
స్లీవ్ లెస్ బ్లౌజ్ లో చిరునవ్వులు చిందిస్తూ నిలువెత్తు సొగసుతో ఈ క్యూట్ బ్యూటీ మాయ చేస్తోంది. పైట కొంగుని కప్పుకున్నప్పటికీ ఆమె పరువాల వరద మాత్రం ఆగడం లేదు.
వివాహం తర్వాత కూడా అలియా భట్ జోరు ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్రలో మెప్పించింది. తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ అలియా పెర్ఫామెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.
అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ ఉత్సవాల పార్టీలో బాలీవుడ్ మొత్తం ఒక్క చోటే చేరినట్లు అనిపించింది. జాన్వీ కపూర్, కియారా అద్వానీ, దిశా పటాని, అర్జున్ కపూర్.. పలువురు సీనియర్ నటీనటులు ఈ వేడుకకి హాజరయ్యారు.