ఎపిసోడ్ ప్రారంభంలో ప్రమాదం కాస్తలో తప్పిపోయింది ఏమాత్రం జాగ్రత్తగా ఉన్న కంటికి తగిలేది అయినా భార్యాభర్తల మధ్యలో దూరాలనుకోవటం ఏమిటి అని కేకలు వేస్తాడు నందు. చిన్న పిల్ల బావతో ఆడాలని ముచ్చట పడింది అయినా అనుకోకుండా జరిగిందానికి ఎందుకు పెద్దది చేస్తున్నారు అంటుంది తులసి. అలా కాదు అత్తయ్య చూసుకోవాలి కదా అంటాడు విక్రమ్.