అంతేకాదు, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ రెండో బిడ్డ పొందాలని అనుకుంటున్నట్టు గతంలోనే వెల్లడించారు. 2022లో IMDb 'ఐకాన్స్ ఓన్లీ'లో ఆలియా మాట్లాడుతూ నటిగానే కాదు, నిర్మాతగా కూడా ఇంకా చాలా సినిమాలు రావాలని ఆశిస్తున్నాను. పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నాను' అని అన్నారు.
మరోవైపు మాషబుల్‌తో జరిగిన చాట్‌లో, రణ్‌బీర్ కపూర్ తన గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, త్వరలోనే మరో బిడ్డ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
అయితే ప్రస్తుతం ఆలియా భట్ ప్రెగ్నెంట్ అనేవన్నీ ఊహాగానాలే. ఆలియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ప్రస్తుతం, ఆమె కేన్స్ హడావిడిలో ఉంది. అదే సమయంలో రణ్‌బీర్ కపూర్ సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.