ఆరుగురు హీరోయిన్లతో అల్లు అర్జున్ రచ్చ, అట్లీ ఏం చేయబోతన్నాడు

Published : May 25, 2025, 02:04 PM ISTUpdated : May 25, 2025, 03:57 PM IST

 అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  కొత్త సినిమాలో ఆరుగురు హీరోయన్లు నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ వారెవరు. అట్లీ ఏం చేయబోతున్నాడు. 

PREV
14
పుష్ప తరువాత భారీ సినిమా

పుష్ప 2 సినిమా సూపర్ హిట్ అయిన తరువాత  అల్లు అర్జున్ సన్ పిక్చర్స్ నిర్మాణంలో కొత్త సినిమా చేస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి వరుసగా ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు  కొత్త విషయాలు బయటపడుతున్నాయి. 

ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు  నటిస్తున్నారు అంటూ గతంలో ఓ వార్త హల్ చల్ చేసింది. కాని ఇప్పుడు ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నట్టు మరో వార్త బయటకు వచ్చింది. వీరిలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లు కాగా. ఇద్దరు టాలీవుడ్ నుంచి  ఒకరు హాలీవుడ్ నటి ఉన్నారని తెలుస్తోంది.   సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతున్న ఈ సినిమా వర్కింగ్ టైటిల్  AA22xA6 . 

24
అల్లు అర్జున్ , అట్లీ కాంబో మూవీ

షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాకి దర్శకత్వం వహించిన అట్లీ, ఈ సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి పనిచేస్తున్నారు. AA22xA6 సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో నటిస్తున్నారు. ఒకటి హీరో, మరొకటి విలన్. మూడోది యానిమేషన్ పాత్ర. 

ఈ సినిమా కోసం అట్లీ అంతర్జాతీయ VFX నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ తన పాత్ర కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన తన ఫిట్‌నెస్, స్టైలింగ్, లుక్ పై దృష్టి పెడుతున్నారు.

34
అల్లు అర్జున్ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు

అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో ఆరుగురు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారట. దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్  నటించనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు కింగ్‌డమ్ సినిమా నటి భాగ్యశ్రీ బోర్సే  కూడా నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతే కాదు వీరితో పాటు సమంత ఈసినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది.  వీరితో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో సందడి చేయబోతుందట. ఆమె పాప్ స్టార్ లేదా హాలీవుడ్ నటి కావచ్చు అని అంటున్నారు.

44
700 కోట్ల బడ్జెట్ తో అట్లీ సినిమా

అల్లు అర్జున్ AA22xA6 సినిమా 800 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇది టైమ్ ట్రావెల్ ఆధారంగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా. హాలీవుడ్ సినిమాల మాదిరిగా దీని విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ప్రారంభం కానుంది. 2026లో ఈ సినిమాను విడుదల చేయాలని  ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించడానికి అల్లు అర్జున్ కి 300 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అట్లీ 100 కోట్లకు పైనే తీసుకుంటున్నారట. 

Read more Photos on
click me!

Recommended Stories