Alia Bhatt On Pregnancy: అప్ సెట్ అయిన ఆలియా భట్, ప్రెగ్నెస్సిపై ట్రోలింగ్, సైలెంట్ గా క్లాస్ పీకిన బ్యూటీ

Published : Jun 30, 2022, 09:42 PM IST

ప్రస్తుతం కపూర్స్ ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయారు. పెళ్ళైన రెండు నెలలకే కొత్త కోడలు ఆలియా భట్ ప్రెగ్నెంట్ అని తెలియడంతో.. రణ్ భీర్ దంపతులతో పాటు అంతా పండగచేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కాని.. ఒక్క విషయంలో మాత్రం అప్ సెట్ అయ్యిందట ఆలియా భట్.. ఇంకీ ఏంటా విషయం..?  

PREV
17
Alia Bhatt On Pregnancy: అప్ సెట్ అయిన ఆలియా భట్,  ప్రెగ్నెస్సిపై ట్రోలింగ్,  సైలెంట్ గా క్లాస్ పీకిన బ్యూటీ

 రెండు రోజుల క్రితం త‌న ప్రెగ్నెన్సీని ప్ర‌క‌టించిస్తూ..సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది బాలీవుడ్  హీరోయిన్ అలియాభ‌ట్ . ఈ విషయం తెలియగానే బాలీవుడ్ ప్రముఖులతో పాటు.. హాలీవుడ్ నుంచి కూడా వరుసగా  శుభాకాంక్షలు అందాయి.  ఈ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ అయితే  విషయం తెలిసిన వెంటనే పండగ చేసుకున్నారు. 

27

పెళ్ళైన రెండున్నర ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్ ను .. ఈ హ్యాపీ మూమెంట్స్‌లో  ఒక వార్త చికాకు పెట్టింది. హ్యాపీ మూడ్ లో ఉన్న ఆమెకు కోపం తెప్పించింది. వెంటనే సోషల్ మీడియాలో ఈ విషయంపై స్పందించింది..  కాదు కాదు ఫైర్ అయ్యింది. 
 

37

అలియాభ‌ట్ ప్రెగ్నెన్సీ  నేప‌థ్యంలో ఆమె న‌టిస్తున్న  సినిమాలు అన్ని ఆగిపోయే అవ‌కాశాలున్నాయ‌ని ప్రెగ్నెంట్ గా ఉండి ఆమె సినిమాల్లో నటించలేదని.. దాంతో ఆమె సైన్ చేసిన సినిమాలు ఆగిపోవల్సిందే అంటూ రకరకాల కథనాలు అటు మిడియాలో, ఇటు సోషల్ మీడియాలో వరుసగా వచ్చాయి.

47
alia bhatt pregnancy

అంతే కాదు ప్రస్తుతం పారెన్ లో ఉన్న ఆమెను  ర‌ణ్ బీర్ క‌పూర్ త్వ‌ర‌లోనే లండ‌న్‌కు వెళ్లి అలియాభ‌ట్‌ ను సేఫ్ గా ఇండియాకు తీసుకు రాబోతున్నాడంటూ రకరకాల కథనాలతో పాటు,  కొంద‌రు వెటకారంగా  ట్రోల్స్ చేస్తూ వచ్చారు. 

57

అయితే ఈ వార్త‌ల‌తో బాగా  అప్‌సెట్ అయింది అలియాభ‌ట్‌. సోష‌ల్ మీడియా ద్వారా త‌న ఆవేద‌నను తెలియ‌జేసింది. మీ రేటింగ్స్ కోసం ఏది పడితే అది ఎలా రాస్తారు. ఎవ‌రూ ఎవ‌రినీ పిక‌ప్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. నేను మహిళను, మనిషిని ..పార్శిల్‌ను కాదు ఎవరో వచ్చి జాగ్రత్తగా ఎత్తుకెళ్ళడానికి అని ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది.

67

 నాకు విశ్రాంతి అవ‌స‌రం లేదు.. ఈ విషయంలో నాకు డాక్టర్ సర్టిఫికేషన్ కూడా ఉంటుందని మీరంతా తెలుసుకోవడం మంచిది. షూటింగ్స్ విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నా కెరీర్ అయిపోయినట్టు ఊహించుకోకండీ.. ఇది 2022వ సంవ‌త్స‌రం...  ఇప్పుడైనా మనం ఈ పాత ఆలోచనా విధానం నుండి బయటపడగలమా..? నా షూటింగ్.. నా షాట్స్ రెడీగా ఉన్నాయి.. నేను వెళ్ళి షూటింగ్ లో జాయిన్ అవ్వడమే తరువాయి అంటూ రాసుకొచ్చింది. 
 

77

ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ లో  సీత పాత్ర‌లో మెరిసింది. ఇదే ఏడాది  ర‌ణ్‌బీర్ క‌పూర్‌ ను పెళ్ళాడిన ఆలియా... అతనితో  న‌టిస్తోన్న బ్ర‌హ్మాస్త్ర సెప్టెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ ఏడాదే ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. వరుసగా గుడ్ న్యూస్ వింటోన్న ఆలియా భట్ ఖాతాలో.. మూడు సినిమాలు ఉండగా.. డార్లింగ్స్  మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మ‌రో రెండు సినిమ‌లు బ్యాలెన్స్ ఉన్నాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories