ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకపనలు సృష్టిస్తున్న విషయం.. సీనియర్ నటుడు నరేష్-పవిత్ర లోకేష్ వ్యవహారం. నరేష్ పవిత్రను నాలుగో పెళ్ళి చేసుకున్నాడని, లేదు సహజీవనం చేస్తున్నాడన్న మాటలు వినిపిస్తున్నాయి. అది పక్కన ఉంచితే.. అసలు నరేష్ కు మూడు పెళ్ళిల్లు ఎలా పెటాకులు అయ్యాయి..? ఆ ముగ్గురు భార్యలెవరో తెలుసుకుందాం..?
టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది నరేష్ పవిత్రల బంధం. పెళ్ళి చేసకున్నారని ప్రచారం జరిగినా.. పవిత్ర లోకేష్ మాత్రం ఈ విషయం కొట్టి పారేశారు. కాకపోతే నరేష్ తో కలిసి సహజీవనం చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఈ విషయంలో కృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అంటోంది. నరేష్ తాను కలిసి కృష్ణతో కలిసి ఫామ్ హౌస్ లో ఉంటున్నట్టు చెపుతోంది.
Naresh- Pavitra Lokesh
మరో వైపు పవిత్ర లోకేష్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న నరేష్ కూడా..పెళ్లి పై వ్యాతిరేక వాఖ్యాలు చేశాడు. ముందు ముందు పెళ్ళిళ్లు ఉండమన్నారు. తన మూడో భార్యకు ఇంకా విడాకులు ఇవ్వని నరేష్.. పవిత్రతో మాత్రం గుళ్ళు గోపురాలే కాకుండా.. ఇతర పార్టీటు, ఫంక్షన్స్ కు తిరుగుతున్నారు.
అటు పవిత్ర కూడా తాను తన మొదటి భర్తను కూడా చట్ట ప్రకారం పెళ్ళి చేసుకోలేదని.. ఆయనతో కూడా సహజీవనం చేశానంటోంది. దాంతో విడాకులు అన్న ప్రస్తావన అవసరం లేదు అంటోంది. ఇటు నరేష్ మూడో భార్యకు విడాకులు కాలేదని.. అలాంప్పుడు తాము పెళ్ళి ఎలా చేసుకుంటాం అంటుంది. నరేష్ చాలా మంది వాడన్ని సర్టిఫికెట్ ఇచ్చిన పవిత్ర, తన భార్య ప్రవర్తన సరిగా ఉండదంటోంది.
ఇకపోతే నరేష్ వ్యక్తిగత జీవితం, 3 పెళ్ళిళ్ళ విషయానికి వస్తే.. ఆయన వివాహ జీవితంలో ఎన్నో ఓడిదుడుకులు ఉన్నాయి. మొదట సీనియర్ కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్తె రేఖను నరేష్ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోయారు.
మొదటి పెళ్ళి పెటాకులు కావడంతో.. వెంటనే రెండో పెళ్లి చేసుకున్నాడు నరేష్ . అయితే ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చిన నరేష్.. వెంటనే మూడో పెళ్ళి కూడా చేసుకున్నారు.
Ramya raghupathi
ఇక 50 ఏళ్ల వయసులో సీనియర్ పొలిటికల్ లీడర్ రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె రమ్య ను హిందూపురంలో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈమె కొన్ని ఆర్థిక నేరాలకు పాల్పడుతోందంటూ.. నరేష్ ఆమె వల్ల ఇబ్బందులు పడుతున్నాడని సమాచారం. అంతే కాదు ఇద్దురు చాలా ఘాటు విమర్షలు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం విడిగా ఉంటున్నా.. ఇంకా విడాకులు తీసుకోలేదు.
ఇక తన మూడు పెళ్ళిళ్లు విడాకుల గురించి నరేష్ క్లారిటీ ఇచ్చారు. తన జీవితం చాలా బిజీగా ఉంటుందని, ఇప్పటికీ తన మొదటి భార్య సినిమానేనని చెప్పారు. తన సినిమా జీవితాన్ని, షూటింగ్ సమయాన్ని అర్థం చేసుకున్న వారే నాతో పాటూ ఉంటారు. మిగతా వాళ్లు విడిపోతారు. అందుకే నాకు మూడు విడాకులు అయ్యాయి. వ్యక్తిగత జీవితానికి తాను అధిక సమయం కేటాయించలేక పోవడం వల్లే తన లైఫ్ లో విడాకులు అయ్యాయని వివరించారు.
Actor Naresh-Pavitra Lokesh and wife Ramy Rghupati
పెళ్లిపై విరక్తితో ఉన్న నరేష్... పవిత్ర లోకేష్ ను పెళ్ళి చేసుకుంటారా..? లేక జీవితాంతం సహజీవనంతో సరిపెట్టుకుంటారా అనేది చూడాలి. ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు.. బయట కూడా వీరి వ్యవహారాన్ని ఇంట్రెస్ట్ గా గమనిస్తున్నారు జనాలు. ఏం జరుగుతుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.