Published : Jun 27, 2022, 11:23 AM ISTUpdated : Jun 27, 2022, 07:03 PM IST
బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే.
బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఇక అలియా భట్ రెండు నెలల క్రితమే ఏప్రిల్ లో తన ప్రియుడు, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది.
26
వీరిద్దరూ తమ మ్యారేజ్ లైఫ్ ని అన్యోన్యంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలసి నటిస్తున్నారు. అలియా, రణబీర్ ఇద్దరూ బాలీవుడ్ స్టార్ కపుల్స్. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా అభిమానులకు కనుల పండుగలా ఉంటుంది.
36
తాజాగా అలియా భట్ సూపర్ న్యూస్ ని అభిమానులకు తెలిపింది. ఫ్యాన్స్ కి ఈ న్యూస్ షాక్ తో పాటు సర్ ప్రైజ్ కూడా అనే చెప్పాలి. త్వరలో అలియా భట్ తల్లి కాబోతోంది. మీరు విన్నది నిజమే. అలియా, రణబీర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు.
46
అలియా భట్ ఈ శుభవార్తని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ నుంచి, నెటిజన్ల నుంచి అలియా భట్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చెకప్ చేయించుకున్న తర్వాత హాస్పిటల్ బెడ్ పై నుంచి అలియా ఈ న్యూస్ ఫ్యాన్స్ కి తెలియజేసింది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న పిక్ ని కూడా పంచుకుంది. అలియా పక్కనే ఆమె భర్త రణబీర్ కపూర్ కూడా ఉన్నాడు.
56
ఆసుపత్రి బెడ్ పై అలియా చిరునవ్వులు చిందిస్తూ, సిగ్గు పడుతూ కనిపించింది. ఈ పిక్ తో పాటు ఆడసింహం, మగ సింహం తమ బేబీ సింహంతో ఉన్న క్యూట్ ఫోటో కూడా అలియా షేర్ చేసింది.
66
ఈ న్యూస్ తెలియగానే స్టార్ సెలెబ్రిటీలంతా అలియా భట్ కి కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రియాంక చోప్రా, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, డయానా పెంటీ, కరణ్ జోహార్, మౌనిరాయ్, టైగర్ ష్రాఫ్ లాంటి ప్రముఖులంతా అలియా, రణబీర్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.