Published : Jul 16, 2023, 01:15 PM ISTUpdated : Jul 16, 2023, 01:34 PM IST
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ ఇన్‌స్టాలో చేసిన తొలి పోస్టు ఆయన అభిమానులతో పాటు, సినీ ఇండస్ట్రీలో పలువురి మనసును దోచుకుంది.
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అందులో ఒక్క పోస్టు పెట్టకముందే 2 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ వచ్చారు. అయితే తాజాగా పవన్ ఇన్‌స్టాలో చేసిన తొలి పోస్టు ఆయన అభిమానులతో పాటు, సినీ ఇండస్ట్రీలో పలువురి మనసును దోచుకుంది.
212
ఈ పోస్టులో పవన్ కల్యాణ్ తన సినీ కెరీర్ గురించిన వీడియోను షేర్ చేశారు. ఇందులో తన సినీ ప్రయాణంలో వివిధ సినీ సెలబ్రిటీలతో ఉన్న ఫొటోలను పొందుపరిచారు. ‘‘మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ...’’ అని పవన్ పేర్కొన్నారు. ఈ పోస్టును చాలా మంది సినీ పరిశ్రమలోని తారలతో పవన్ అమూల్యమైన క్షణాల అందమైన వీడియో అని పేర్కొంటున్నారు.
312
అయితే ఈ పోస్టులో చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నందమూరి ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మహేష్ బాబు, విజయ్, కార్తీ వంటి పెద్ద స్టార్లతో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటోలను మనం గుర్తించవచ్చు. అలాగే పలవురు హీరోలు, హీరోయిన్లు, నిర్మాతుల, దర్శకులు, సంగీత దర్శకులు, డ్యాన్స్ మాస్టర్లు, సన్నిహితులు, కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫొటోలు కూడా ఇందులో ఉన్నాయి. రేణు దేశాయ్ ఫొటో కూడా ఇందులో ఉంది. అయితే ఒక ఇద్దరి ఫొటోలు మాత్రం ఇందులో లేకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
412
ఈ వీడియోలో పవన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నటుడు అలీతో పాటు, పవన్‌తో కలిసి నటించిన పోసాని కృష్ణమురళి ఫొటోలు లేవు. మోహన్‌బాబు ఫొటో కూడా ఇందులో లేదు. సినీ ఇండస్ట్రీలో అందరితో ఉన్న క్షణాలను గుర్తుచేసుకున్న పవన్.. వారిద్దరి ఫొటోలను మాత్రం ఆ వీడియోలో పొందుపర్చకపోవడంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అలీ, పోసాని కృష్ణమురళీలు వైసీపీలో ఉన్నారు.
512
ప్రస్తుతం ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న పోసాని కృష్ణమురళీ.. గత కొంతకాలంగా పవన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోసాని ఫొటోను పవన్ కావాలనే ఈ వీడియోలో విస్మరించానే విశ్లేషణలు ఉన్నాయి. ఇక, పవన్- పోసానిలు అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
612
మంచు కుటుంబానికి, మెగా కుటుంబానికి పడదు అనే ప్రచారం చాలా కాలంగా ఉంది. ఈ క్రమంలోనే పవన్ పోస్టులో మోహన్‌బాబు ఫొటో లేకపోవడం మరోసారి హాట్ టాఫిక్‌గా మారింది. అయితే మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్ ఫొటోకు మాత్రం పవన్ తన పోస్టులో స్థానం కల్పించారు.
712
ఇక, అలీ విషయానికి వస్తే.. పవన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అలీ ఫొటో ఆ పోస్టులో కనిపించకపోవడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. పవన్ కల్యాణ్ నటించిన మెజారిటీ సినిమాల్లో అలీ కనిపిస్తుంటారు. అలాగే సినీ వేదికలపైన కూడా పవన్ కల్యాణ్ పక్కనే అలీ దర్శనమిస్తుంటారు.
812
Pawan kalyan - Ali
అయితే అలీ వైసీపీలో చేరిన తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఈ క్రమంలోనే పవన్‌పై కూడా అలీ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పవన్ చేసిన చిత్రాల్లో అలీ కనిపించలేదు. ఈ క్రమంలోనే పవన్, అలీల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం సాగింది. వారు కలిసి కనిపించకపోవడం కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. అయితే అలాంటిదేమి లేదని అలీ వైపు నుంచి వాదన వినిపించిన.. ఆ ప్రచారానికి తెరపడలేదు.
912
Ali Daughter Fathima Marriage
కొన్ని నెలల క్రితం అలీ తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఆ వేడుకకు కూడ పవన్ కల్యాణ్ హాజరు కాలేదు. దీంతో పవన్-అలీల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం మరోసారి తెరమీదకు వచ్చింది. అయితే తమ మధ్య గ్యాప్ లేదని అలీ చెబుతూ ఉంటారు. రాజకీయం.. స్నేహం వేరని అంటున్నారు.
1012
Pawan kalyan - Ali
అయితే పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్దమా? అని మీడియా ప్రశ్నించగా.. సీఎం జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని అలీ బదులిచ్చారు. అయితే అలీ తీరుపై పవన్ అభిమానులు కూడా గుర్రుగా ఉన్నారు.
1112
అయితే తాజాగా పవన్ కల్యాణ్ షేర్ చేసిన పోస్టు ద్వారా అలీతో ఆయనకు దూరం ఉందనేది స్పష్టంగా తెలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సప్తగిరి, వేణుమాధవ్, వెన్నెల కిషోర్, హైపర్ ఆది, మౌనిక.. వంటి నటీనటులతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన పవన్.. అలీతో ఉన్న ఫోటోను ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టినట్టుగా కనిపిస్తోంది.
1212
కాటమరాయుడు చిత్రంలో నుంచి ఓ ఫోటో విషయంలో కూడా.. తనకు తమ్ముళ్లకు నటించిన నలుగురు నటులతో ఉన్న ఫొటో షేర్ చేశారే తప్ప.. అందులో కూడా అలీ ఫొటో కనిపించలేదు. ఈ పరిణమాల గమనిస్తే.. రాజకీయాల కారణంగా అలీ, పవన్‌ల మధ్య ఫ్రెండ్‌షిప్‌కు బ్రేక్ పడినట్టుగా స్పష్టం అవుతుంది.