రాజమౌళి మూవీలో ఎన్టీఆర్ కొడుకు మహేష్ కూతురు... చైల్డ్ ఆర్టిస్ట్స్ గా ఆ పాత్రల్లో!

First Published | Jul 16, 2023, 11:34 AM IST


టాలీవుడ్ లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదే నిజమైతే ఎవరూ ఊహించని కాంబినేషన్ అవుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి ఓ ఆలోచన చేస్తున్నారట. 
 

NTR-Mahesh Babu

రాజమౌళి చాలా మొండివాడు. తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు. ఆయన సెట్ చేసే కాంబినేషన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. కన్నడలో స్టార్ హీరోగా ఉన్న సుదీప్ ని విలన్ గా మార్చేశాడు. హీరోగా ఎదుగుతున్న రానాను సైతం నెగిటివ్ రోల్ కి ఒప్పించాడు. ఈ కాంబినేషన్స్ సెట్ చేయడం అంత సులభం కాదు. 

Mahesh Babu

వీటన్నింటికీ మించింది ఆర్ ఆర్ ఆర్ కాంబినేషన్. నందమూరి-మెగా హీరోలు కలిసి ఒక సినిమా చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఆ రెండు కుటుంబాల అభిమానుల మధ్య దశాబ్దాల వైరం ఉంది. పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే ఫ్యాన్ రైవల్రీ. కానీ రాజమౌళి అసాధ్యం సుసాధ్యం చేశాడు. ఇద్దరు హీరోల అభిమానులు చాలా వరకు సంతృప్తి చెందేలా ఆర్ ఆర్ ఆర్ మూవీలో వారి పాత్రలు డిజైన్ చేశాడు. 


NTR-Mahesh Babu

నెక్స్ట్ ఆయన హీరో మహేష్ బాబుతో మూవీ చేస్తున్నారు. స్క్రిప్ట్ రెడీ. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు. ఇది జంగిల్ యాక్షన్ అడ్వెంచర్. మహేష్ బాబు పాత్ర ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా ఉంటుందని తెలుస్తుంది.

Sitara Ghattamaneni

రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కి మించి ఉంటుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా చెప్పారు. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు పని చేయనున్నారట. ఈ చిత్ర బడ్జెట్ రూ 800 కోట్లు అంటుకుంటున్నారు. అది పెరిగే అవకాశం కూడా కలదు. 

ntr

కాగా ఈ మూవీలో మహేష్ కూతురు సితార, ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్స్ గా నటిస్తున్నారట. కథ ప్రకారం దాదాపు 15 నిమిషాలు పరిచయ సన్నివేశాలు ఉంటాయట. అవి అక్క తమ్ముడు పాత్రలపై నడుస్తాయట. ఈ చైల్డ్ ఆర్టిస్ట్స్ రోల్స్ సితార, అభయ్ రామ్ చేయనున్నారట. ఈ మేరకు రాజమౌళి ఫిక్స్ అయ్యాడట. 

Sitara Ghattamaneni

సితార ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధంగా ఉంది. అందులోనూ మహేష్ మూవీ. అటువైపు నుండి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇక ఎన్టీఆర్-రాజమౌళి అనుబంధం గురించి తెలిసిందే. రాజమౌళి అడిగితే ఎన్టీఆర్ కాదనేది లేదు. కాబట్టి నిజంగా రాజమౌళి సితార, అభయ్ రామ్ లను ఎంచుకుంటే ఖచ్చితంగా అది సాకారం అవుతుంది. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 

Latest Videos

click me!