Alekhya Harika: నన్ను ఎవరైనా ఆ మాట అంటే గుడ్డలూడదీసి కొడతా.. దేత్తడి హారిక స్ట్రాంగ్ వార్నింగ్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 13, 2022, 03:11 PM IST

బిగ్ బాస్ 4లో హారిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మేల్ కంటెస్టెంట్స్ కి ధీటుగా రాణించింది. బిగ్ బాస్ లో బాగా హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో హారిక కూడా ఒకరు. ఆమె టాప్ 5గా నిలిచింది.

PREV
16
Alekhya Harika: నన్ను ఎవరైనా ఆ మాట అంటే గుడ్డలూడదీసి కొడతా.. దేత్తడి హారిక స్ట్రాంగ్ వార్నింగ్

యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్, సెటైరికల్‌, కామెడీ వీడియోలతో బాగా  పాపులర్ అయింది హారిక. దేత్తడి అనే పదాన్నే ఇంటి పేరుగా మార్చుకుంది అలేఖ్య హారిక. ఇచ్చిపడేస్తా అంటూ బిగ్‌బాస్‌ 4లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

26

బిగ్ బాస్ 4లో హారిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మేల్ కంటెస్టెంట్స్ కి ధీటుగా రాణించింది. బిగ్ బాస్ లో బాగా హైలైట్ అయిన కంటెస్టెంట్స్ లో హారిక కూడా ఒకరు. ఆమె టాప్ 5గా నిలిచింది. హారిక యూట్యూబ్ లో ఎంత ఫేమస్సో బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో అంతే పాపులర్ అవుతోంది. 

36

తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ తనలోని బ్యూటీని బయట పడుతోంది. ట్రెండీ డ్రెస్సులు, లంగావోణీ, లెహంగా ఇలా విభిన్నమైన డ్రెస్సుల్లో హారిక గ్లామర్ ఒలకబోస్తోంది. నటీమణులు, సెలబ్రీటీలకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కామన్ ప్రాబ్లెమ్ గా మారిపోయింది. 

46

దేత్తడి (అలేఖ్య) హరికకి కూడా సోషల్ మీడియాలో ఈ సమస్య ఎదురైంది. హారిక షేర్ చేస్తున్న ఫోటోస్ పై కొందరు నెటిజన్లు కించపరిచే విధంగా, బోడి షేమింగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. హారికని పొట్టి, బుడ్డది అంటూ ఆమె హైట్ గురించి ట్రోల్ చేస్తున్నారు. 

56

ఈ కామెంట్స్ కి విసిగిపోయిన హారిక తనదైన శైలిలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రామయ్య వస్తావయ్యా చిత్రంలో ఎన్టీఆర్ డైలాగ్ చెబుతున్న స్టిల్ పోస్ట్ చేసి 'అర్థం అయింది కదా' అని కామెంట్ పెట్టింది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ 'ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా' అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఆ స్టిల్ నే హారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసి తనని కామెంట్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చింది. 

66

ట్రోలర్స్ కి హారిక తన ఇంటెన్షన్ క్లియర్ గా చెప్పేసింది. ఏది ఏమైన దేత్తడి హారిక గ్లామర్ పిక్స్ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నడుము అందాలు ఆరబోస్తూ కనువిందు చేస్తోంది. 

click me!

Recommended Stories