Kesari Chapter 2 Review: శంకరన్ నాయర్ గా అక్షయ్ అదరగొట్టాడు, మరి కేసరి చాప్టర్ 2 హిట్టా, ఫట్టా?

Published : May 22, 2025, 09:16 PM IST

బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలిచిన కేసరి సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కేసరి చాప్టర్ 2: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ  సినిమా ఎలా ఉంది? హిట్లా ఫట్టా? 

PREV
15

కేసరి చాప్టర్ 2: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్ సినిమాలో అక్షయ్ కుమార్, ఆర్. మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా కథ, జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ చుట్టూ తిరుగుతుంది. ఈ ఘటనకు బాధ్యుడిగా ఉన్న జనరల్ డయర్‌పై, బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పనిచేసే అడ్వొకేట్ శంకరన్ నాయర్ (అక్షయ్ కుమార్) కోర్టులో కేసు వేస్తాడు. అతడికి దిల్రీట్ గిల్ (అనన్య పాండే) అనే యువ అడ్వొకేట్ తోడుంటుంది. మరోవైపు, జనరల్ డయర్‌ తరపున నెవిల్ మెక్‌కిన్లీ (ఆర్. మాధవన్) అనే బ్రిటిష్ అడ్వొకేట్ వాదిస్తుంటాడు.

25

కథ నడుస్తున్న తీరు, కోర్ట్ రూమ్‌లో జరిగే పరిణామాలు చరిత్రలోని కొన్ని తెలియని నిజాలను బయటపెడతాయి. దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి చారిత్రక సంఘటనను గంభీరంగా, ఎక్కడా పొరపాటు లేకుండా హుందాగా తెరకెక్కించారు. కోర్ట్ డ్రామా ఫార్మాట్‌లో ఈ ఘటనను చూపించడం విశేషం. అక్షయ్ కుమార్ శంకరన్ నాయర్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన నటన, స్క్రీన్‌ప్లే ప్రేక్షకుల గుండెల్లోకి నేరుగా బలమైన సందేశాన్ని తేవగలగింది.

35

ఆర్. మాధవన్, అనన్య పాండే మంచి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అయితే కథ మొదట్లో కొంచెం నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా మాధవన్ పాత్ర కీలక ఘట్టాల్లో ఎక్కువ భాగం మౌనంగా ఉండడం కొద్దిగా మైనస్ పాయింట్.

45

టెక్నికల్ గా చూసుకుంటే సంగీత దర్శకుడు శశ్వత్ సచదేవ్ నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు ఇంటెన్సిటీని ఇచ్చింది. సినిమాటోగ్రఫీ ద్వారా పాతకాలపు వాతావరణాన్ని బాగా చూపించగలిగారు.. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండి ఉంటే బావుండేది.

55

ఇక ఫైనల్ గా కేసరి చాప్టర్ 2 చారిత్రక సంఘటనను కోర్ట్ డ్రామా రూపంలో విజయవంతంగా చూపిస్తుంది. చరిత్రను మళ్లీ మనముందుంచే విధంగా కథ నడిచింది. హిస్టారికల్ డ్రామాలను ఇష్టపడే వారికి తప్పక చూడదగిన సినిమా ఇది.

Read more Photos on
click me!

Recommended Stories