
టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్) నట వారసుడిగా ఆయన సినిమాల్లోకి వచ్చారు. హీరోగా రాణించారు. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం సీనియర్లలో ఆ నలుగురు హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు.
ప్రయోగాత్మక చిత్రాలతో మెప్పించిన నాగార్జున రొమాంటిక్ లవ్ స్టోరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతోపాటు కెరీర్ బిగినింగ్‌లో యాక్షన్ మూవీస్ కూడా చేశారు. అలాగే దైవభక్తి చిత్రాలతోనూ ఆకట్టుకున్నారు. రొమాంటిక్ చిత్రాలు చేసే నాగార్జున, ఆథ్మాత్మిక చిత్రాలతోనూ మెప్పించడం విశేషం, ఇదే అందరిని ఆశ్చర్యపరిచింది.
నాగార్జునని ప్రత్యేకంగా నిలిపింది. ఈ ఆథ్యాత్మిక చిత్రాలతో విమర్శకుల చేత ప్రశంసలందుకున్నారు. తాను ఎలాంటి పాత్రలైనా చేయగలను అని నిరూపించుకున్నారు మన్మథుడు.
సినిమాల్లో మన్మథుడు అనిపించుకున్న నాగార్జున రియల్ లైఫ్‌లోనూ మన్మథుడు ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. గ్లామర్ పరంగానూ ఆయన ఎంతో అందంగా ఉండేవారు. దీంతో అప్పట్లో అమ్మాయిల గ్రీకువీరుడు అనిపించుకున్నారు.
అయితే తన పర్సనల్ లైఫ్‌లోనూ అలాంటిదే జరిగింది. నాగార్జున మొదట లెజెండరీ నిర్మాత డి రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరిది అరెంజ్ మ్యారేజ్. కానీ ఈ బంధం నిలవలేదు. లక్ష్మి వృత్తి రీత్యా డాక్టర్. నాగార్జున యాక్టర్.
ఈ రెండు పూర్తి భిన్నమైనవి. ఈ విషయాల్లో ఇద్దరి మధ్య భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయినట్టు, ఆ తర్వాత వీరిద్దరి విడిపోయినట్టు ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం ఏంటనేది వారికే తెలియాలి. కానీ నాగార్జున, లక్ష్మిలకు నాగచైతన్య జన్మించారు.
నాగార్జున.. లక్ష్మితో విడిపోయిన రెండేళ్లకి హీరోయిన్ అమలని పెళ్లి చేసుకున్నారు. వీరిద్ది ప్రేమ వివాహం. అమలకు ఫిదా అయిన నాగార్జున ఆమెని పెళ్లి చేసుకోవడానికి ఐదారేళ్లు పట్టింది. ఈ లెక్కన లక్ష్మితో విడిపోవడానికి ఈ లవ్ మ్యాటర్ కూడా ఓ కారణంగా చెప్పొచ్చు.
ఇంకా చెప్పాలంటే నాగ్ ఇంట్లో హ్యాపీ లేకపోవడం వల్లే అమలకు దగ్గరయ్యారని తెలుస్తోంది. ఏదేమైనా అమలకి ఫిదా అయ్యారు నాగార్జున. ఆమెకి పడిపోయాడు, కానీ ప్రపోజ్ చేయడానికి చాలా టైమ్ పట్టిందట.
తన లవ్ మ్యాటర్ ఒక ట్రాక్ ఎక్కడానికి చాలా టైమ్ తీసుకోవాల్సి వచ్చిందట. ఫైనల్‌గా ఓ రోజు అమలకి ప్రపోజ్ చేశాడట నాగార్జున. తాను ప్రపోజ్ చేయగానే బోరున ఏడ్చేసిందట అమల. అయితే అది ఇష్టం లేకపోవడం వల్ల కాదు, ఆనందంతో అట.
తాను తన ప్రేమని వ్యక్తం చేయగానే ఆమె కన్నీళ్లు పెట్టుకుందని, ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయిందని తెలిపారు నాగ్. ప్రపోజ్ చేసిన తర్వాత కూడా చాలా రోజులు లవ్ ట్రాక్‌ని నడిపించారట.
ఫైనల్‌గా నాగార్జున ప్రేమ మ్యాటర్ నాన్న, లెజెండరీ నటుడు ఏఎన్నార్ వద్దకు వెళ్లింది. ఆయన ముందు ఒప్పుకోలేదు. దీంతో నాగార్జున, అమల చాలా సింపుల్‌గానే ప్రేమ వివాహం చేసుకున్నారు.
మొదట్లో ఇష్టం లేకపోయినా నాగార్జున సంతోషంగా ఉండటం చూశాక ఏఎన్నార్ కూడా కూల్ అయ్యారట. ఆ తర్వాత అంతా ఫ్రీ అయినట్టు తెలిపారు నాగార్జున. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోలో నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు.
అమలని పెళ్లి చేసుకోవడం తన జీవితంలో తాను తీసుకున్న ఒక బెస్ట్ డెసీషన్ అని ఆయన వెల్లడించారు. అమల విషయంలో తాను వంద శాతం హ్యాపీగా ఉన్నానని తెలిపారు. అదే సమయంలో తన విషయంలో కూడా అమల అంతే హ్యాపీ అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.
అయితే ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు నాగార్జున. ఏఎన్నార్ తన పెళ్లికి ఒప్పుకోకపోవడానికి కారణం కూడా చెప్పారు. తన అంచనా ప్రకారం ఆయన ఆలోచన ఏమై ఉంటుందో వెల్లడించారు.
నాగార్జున చెబుతూ, తన మొదటి పెళ్లి విషయంలో జరిగిన ఫలితం నాన్నగారిపై కొంత ప్రభావం చూపించి ఉండొచ్చు అని అన్నారు. అంతేకాదు అమల మన తెలుగు అమ్మాయి కాదు, వేరే స్టేట్ అమ్మాయి కావడం, సినిమాల్లోని అమ్మాయి కావడం వంటి అంశాలు ఆయనకు ఇష్టం లేకపోవడానికి కారణం కావచ్చు అన్నారు.
అదే సమయంలో ఏఎన్నార్ జీవితంలో జరిగిన మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు నాగ్. ఏఎన్నార్ కి చాలా లేట్‌గా వివాహం జరిగిందట. తనకు పిల్లని ఇచ్చేందుకు అప్పట్లో ఎవరూ ఆసక్తి చూపించలేదట. అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదట.
దీంతో చాలా లేట్‌గా పెళ్లి అయ్యిందని, ఆ సంఘటన నుంచి నాన్న తన జీవితంలో కొన్ని రూల్స్ పెట్టుకున్నారని, ఫ్యామిలీలోనూ రూల్స్ ఫాలో అయ్యారని తెలిపారు నాగ్. పిల్లలను పెంచే విషయంలో, ఇతరులతో రిలేషన్ విషయంలోనూ కొన్ని నియమాలు పాటించారని తెలిపారు.
ఆ నియమాలు కూడా తన పెళ్లి విషయంలో ప్రభావం చూపించి ఉండొచ్చని, తాను అమలని పెళ్ళి చేసుకోవడంలో ఆయన అంతగా సంతోషంగా లేకపోవడానికి కారణం కావచ్చు అన్నారు నాగార్జున. దీంతోపాటు మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
తన జీవితంలో పెట్టుకున్ని నియమాల వల్లే ఆయన ఇండస్ట్రీలోనూ ఎవరితోనూ రిలేషన్ పెట్టుకోలేదని, హీరోయిన్ల విషయంలో ఎఫైర్ల జోలికి వెళ్లలేదని తెలిపారు. ఆ విషయంలో ఏఎన్నార్ చాలా క్లీన్‌గా ఉన్నారని, ఎలాంటి రిమార్క్ లేదని రాధాకృష్ణ కూడా చెప్పారు. చాలా మంది హీరోలకు ఇలాంటి రూమర్స్ వచ్చాయి కానీ ఏఎన్నార్ విషయంలో అలాంటిది ఒక్కటి కూడా రాలేదని తెలిపారు.
ఇక నాగార్జున 1984లో లక్ష్మి దగ్గుబాటిని పెళ్లి చేసుకోగా, ఆరేళ్ల తర్వాత విడిపోయారు. రెండేళ్ల తర్వాత 1992లో అమలని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అఖిల్ జన్మించారు. ఆయన హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే వ్యాపారవేత్త కూతురు జైనబ్ రవ్‌డ్జీ ని వివాహం చేసుకున్నారు. గ్రాండ్‌గా వీరి రిసెప్షన్ వేడుక జరిగింది. ఇక నాగార్జున, అమల కలిసి `శివ`, `శివ`(హిందీ), `కిరాయి దాదా`, `ప్రేమ యుద్ధం`, `నిర్ణయం`, `చినబాబు` వంటి చిత్రాల్లో నటించారు.
ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది అమల. చాలా ఏళ్ల తర్వాత ఆమె ఇటీవల `ఒకే ఒక జీవితం` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
నాగార్జున ప్రస్తుతం రజనీకాంత్ తో `కూలీ`, ధనుష్‌తో కలిసి `కుబేర` చిత్రంలో నటిస్తున్నారు. `కుబేర` మూవీ ఈ నెల 20న విడుదల కాబోతుంది. దీనికి శేఖర్ కమ్ముల దర్శకుడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.
వీటితోపాటు సోలో హీరోగా ఓ మూవీ చేసే పనిలో ఉన్నారు నాగ్. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సింది. అలాగే `బిగ్ బాస్ తెలుగు` రియాలిటీ షోకి ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. 9వ సీజన్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది.