ANR: తాగేసి హోటల్ లో గొడవ, స్టార్ హీరోని పిలిచి వార్నింగ్ ఇచ్చిన ఏఎన్నార్..అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా

Published : Aug 06, 2026, 08:16 AM IST

అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణం రాజు మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ గొడవ తర్వాత ఏఎన్నార్ కృష్ణం రాజుని పిలిచి వార్నింగ్ ఇచ్చారట. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
Krishnam Raju

అక్కినేని నాగేశ్వర రావు తన నటనతో పాటు క్రమశిక్షణతో కూడా గొప్ప గుర్తింపు సొంతం చేసుకున్నారు. అంతటి క్రమశిక్షణ పాటించారు కాబట్టే వందల సినిమాల్లో నటించారు. ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఏఎన్నార్, కృష్ణం రాజు మధ్య మంచి అనుబంధం ఉంది. ఏఎన్నార్ అంటే నాకు చాలా ఇష్టం అని కృష్ణం రాజు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీరిద్దరూ కలసి జై జవాన్, బుద్దిమంతుడు లాంటి చిత్రాల్లో నటించారు.

25
మేకప్ వేసుకుంటే మందు తాగను

ఒక్కసారి మేకప్ వేసుకుంటే మందు తాగడం, మందు తాగితే మేకప్ వేసుకోవడం నా జీవితంలో చేయలేదు అని కృష్ణం రాజు తెలిపారు. బుద్దిమంతుడు మూవీ షూటింగ్ లో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఒక ఛేజింగ్ సీన్ ఉంటుంది. అందులో లాజిక్ ఏమీ ఉండదు. చాలా చెత్తగా ఉంటుంది ఆ సీన్. ఏఎన్నార్ గారి దగ్గరకు వెళ్లి.. ఇది మనిద్దరం నటించిన సీన్.. ఇందులో ఏమాత్రం లాజిక్ లేదు అని చెప్పా. ఆయన వెంటనే అవును నిజమే కదా అని అన్నారు. ఇలాంటి తప్పులు ఉంటే ఏఎన్నార్ గారు అస్సలు ఊరుకోరు. ధైర్యంగా దర్శకుడు, నిర్మాతకు చెప్పేస్తారు.

35
నా ధైర్యం ఏఎన్నార్ కి నచ్చింది

మీరు అసలు సైలెంట్ గా ఉండరు కదా. ఈ సీన్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడిగా. నా ధైర్యం, నేను సీన్ ని గమనించిన విధానం నాగేశ్వర రావు గారికి నచ్చింది. అప్పటి నుంచి నేను ఆయనకి బాగా క్లోజ్ అయ్యాను అని కృష్ణం రాజు అన్నారు. ఆయనతో మరో సంఘటన కూడా జరిగింది.

45
తాగేసి హోటల్ లో గొడవ

ఒక రోజు రాత్రి నాగేశ్వర రావు గారి మేకప్ మాన్, మరో మేకప్ మాన్, ఒక పొలిటీషియన్ కమ్ ప్రొడ్యూసర్ హోటల్ లో కూర్చుని రాత్రి భోజనం చేశారు వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను. మందు కూడా తాగారు. మందు ఎక్కువై గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టారు. పెద్ద గొడవ జరిగింది. నాగేశ్వర రావుగారి మేకప్ మాన్ తాగిన మత్తులో పోలీసులకు ఫోన్ చేస్తున్నాడు. వెంటనే నేను ఫోన్లాగేసి.. ఏంటి నేను ఉండగా ఇక్కడికి పోలీసులని పిలిస్తావా అని వార్నింగ్ ఇచ్చా. దెబ్బకు అతడు అక్కడి నుంచి పారిపోయాడు. కా గొడవ జరిగినట్లు.. అందులో కృష్ణం రాజు కూడా ఉన్నట్లు మొత్తం అందరికీ తెలిసిపోయింది.

55
ఏఎన్నార్ వార్నింగ్ ఇచ్చారు, కానీ ట్విస్ట్

మరుసటి రోజు ఉదయమే నాగేశ్వరరావు గారితో నాకు షూటింగ్ ఉంది. నేను వీళ్ళేసరికే మేకప్ మాన్ ఆ సంఘటన గురించి ఏఎన్నార్ గారికి లేనిపోనివి చెప్పేశాడు. ఏఎన్నార్ గారు నన్ను పిలిచారు. సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. మనం నటులుగా ఉన్నప్పుడు సమాజం చూస్తూ ఉంటుంది. కొంచెం పద్ధతి పాటించాలి. మనం మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇలాంటి చిల్లర గొడవల్లో ఉండకూడదు అని తిట్టారు. నేను స్పందిస్తూ.. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం అయింది. నాగేశ్వర రావు గారు ఒక్క విషయం చెబుతా.. రాత్రి నేను అస్సలు మందు తాగలేదు. గొడవ కూడా చేయలేదు. తాగేసి వాళ్ళు గొడవ చేస్తుంటే నేను ఆపాను అని చెప్పా. మందు తాగలేదా అని ఏఎన్నార్ గారు ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆయనకి నాపై గౌరవం ఇంకా పెరిగింది అని కృష్ణం రాజు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories