Nagarjuna: నాగార్జున రోజూ తినే ఫుడ్ ఇదే.. ఆ జ్యూస్ వల్లే ఆయన జుట్టు ఇంకా రాలిపోలేదు.!

Published : Apr 21, 2026, 12:00 PM IST

Nagarjuna: వయసుతో సంబంధం లేకుండా నాగార్జున యంగ్ గా ఉండటానికి కారణం కేవలం కఠినమైన వ్యాయామం మాత్రమే కాదు, పక్కాగా పాటించే ఈ డైట్ ప్లాన్ కూడా. క్రమం తప్పకుండా జిమ్ చేయడం.. 

PREV
15
వయసు పెరుగుతున్న కొద్దీ..

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున వయసు పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్ గా కనిపిస్తుంటారు. ఆయన రిచ్‌నెస్ పక్కన పెడితే, ఆయన పాటించే క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లు అందరికీ ఆదర్శం. నాగార్జున ఫిట్‌నెస్ వెనుక ఉన్న అసలు రహస్యాలను ఆయన వద్ద ఎక్కువ కాలం మేకప్ మ్యాన్‌గా పనిచేసిన చంద్ర ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

25
ఆరోగ్యకరమైన ఉదయపు అలవాట్లు

నాగార్జున షూటింగ్ సెట్‌కు రాగానే ముందుగా ఒక పెద్ద గ్లాసు ప్రత్యేకమైన జ్యూస్ తాగుతారు. ఇందులో ఉసిరికాయ, క్యారెట్, బీట్రూట్, నిమ్మకాయ, తేనె లేదా పటిక బెల్లం కలిపి మిక్సీ చేస్తారు. ఈ జ్యూస్ తాగడం వల్లే ఆయన జుట్టు ఇప్పటికీ అంత బలంగా ఉందని, చర్మం మెరుస్తుందని చంద్ర తెలిపారు. ఈ జ్యూస్ ను ఆయన పరగడుపున తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరని ఆయన పేర్కొన్నారు.

35
మితాహారం, డైట్ ప్లాన్

నాగార్జున వారంలో ఐదు రోజులు చాలా సాదాసీదా ఆహారం తీసుకుంటారు. ఏదైనా తినేటప్పుడు చాలా మితంగా తీసుకుంటారు. ఉదాహరణకు టిఫిన్ లో ఒక ఇడ్లీ లేదా ఒక వడ మాత్రమే తింటారు. ఆకలి వేస్తేనే తింటారని, ఆకలి లేనిదే ఏదీ ముట్టరని చంద్ర వెల్లడించారు. మధ్యాహ్న భోజనంలో ఆయనకు బెండకాయ కూర తప్పనిసరిగా ఉండాలి. సాధారణ రైస్ కాకుండా దంపుడు బియ్యాన్ని చాలా మెత్తగా వండించుకుని తింటారు.

45
వీకెండ్ స్పెషల్స్.. ఫిష్ అంటే ప్రాణం

వారాంతాల్లో నాగార్జున తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. శనివారం వచ్చిందంటే ఆయనకు చందువా చేప(పాంప్లెట్ చేప) ఉండాల్సిందే. దీనిని ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, పెప్పర్, అల్లం ముక్కలతో ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. ఇక ఆదివారం పూట చికెన్ లేదా మటన్ తీసుకున్నప్పటికీ, కేవలం రెండు మూడు ముక్కలతోనే సరిపెట్టుకుంటారని చంద్ర తెలిపారు.

55
కఠినమైన వ్యాయామం మాత్రమే కాదు..

వయసుతో సంబంధం లేకుండా నాగార్జున యంగ్ గా ఉండటానికి కారణం కేవలం కఠినమైన వ్యాయామం మాత్రమే కాదు, పక్కాగా పాటించే ఈ డైట్ ప్లాన్ కూడా. క్రమం తప్పకుండా జిమ్ చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారానే ఆయన అందరినీ ఆశ్చర్యపరిచే ఫిట్‌నెస్ ని మెయింటైన్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories