‘మనం’ చిత్రంతో అక్కినేని నాగేశ్వర్ రావు, నాగార్జున, నాగచైతన్య ఒకే ఫ్రేమ్ లో అభిమానులను అలరించారు. ఏడెనిమిదేండ్ల కింద వచ్చిన ఈ అక్కినేని ఫ్యామిలీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. నాగార్జున (Nagarjuna) - నాగచైతన్య (Naga Chaitanya) మల్టీస్టారర్ గా ఇటీవల వచ్చిన ‘బంగార్రాజు’ కూడా బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది.