వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో 'కళామందిర్ రాయల్' బ్రాండ్ ఘనంగా ప్రారంభం అయింది. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్ 36లో ఇది అందుబాటులోకి వచ్చింది. దీనిని ప్రముఖ నటి, సామాజిక వేత్త అమల అక్కినేని, సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల ప్రారంభించారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్ దివ్య రెడ్డి, దీపికా రెడ్డి, పద్మజ ల్యాంకో, శుభ్ర మహేశ్వరి, కల్పన తదితరులు హాజరయ్యారు.