Akhil going to become a father : అక్కినేని వారింట ఇంట శుభవార్త అంటూ.. సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. కింగ్ నాగార్జున తాత కాబోతున్నట్టు టాలీవుడ్ కోడై కూస్తోంది. ఇంతకీ తండ్రి అయ్యేది ఎవరు నాగచైతన్య.. లేక అఖిల్ అక్కినేనినా..?
గత కొన్ని రోజులుగా అక్కినేని ఇంట శుభవార్త అంటూ సోషల్ మీడియాలో, టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అక్కినేని ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడన్న టాక్ తెగ వైరల్ అయ్యింది. ఈమధ్య కాలంలోనే నాగచైతన్య శోభితకు, అఖిల్, జైనాబ్ కు పెళ్లయ్యింది. కాగా ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి వారసుడిని ఈ ఇద్దరు హీరోలలో ఒకరు ఇవ్వబోతున్నట్టు సమాచారం. శోభిత ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. నాగచైతన్య తండ్రి కాబోతున్నటాడంటూ.. గుసగుసలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే శోభిత ఈ విషయం దాచడం కష్టమనే చెప్పాలి.
25
అఖిల్ అక్కినేని తండ్రి కాబోతున్నాడా?
అక్కినేని అఖిల్ ఈ ఏడాది జూన్ నెలలో జైనబ్‌తో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వయస్సులో జైనబ్ అఖిల్ కంటే పెద్ద. అయినా సరే వారి ఇద్దరి మనసులు కలవడం, ఇరు కుటుంబాల అంగీకారం లభించడంతో ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లి తర్వాత అక్కినేని కుటుంబం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో అక్కినేని నాగ చైతన్య, అఖిల్‌లకు సంబంధించిన పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నాగచైతన్య తండ్రి కాబోతున్నాడని కొన్ని రోజులు వార్తలు హల్ చేయగా.. ఇప్పుడు చైతూ కాదు.. ఆయనకంటే ముందు అఖిల్ తండ్రి కాబోతున్నాడన్న వార్త వినిపిస్తోంది. ఈ విషమంపై తాజాగా స్పందించారు కింగ్ నాగార్జున.
35
నాగార్జున ఏమన్నారంటే?
అక్కినేని కోడళ్లు ప్రెగ్నెంట్స్ అయ్యారు అనే వార్త బయటకురాగానే క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఈక్రమంలో నాగార్జున ఓ హెల్త్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక లేడీ రిపోర్టర్, “మీరు త్వరలోనే తండ్రి నుంచి తాతగా ప్రమోట్ అవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది?” అని ప్రశ్నించారు. దీనికి నాగార్జున చిరునవ్వుతో స్పందిస్తూ, “సరైన సమయం వచ్చినప్పుడు నేనే అధికారికంగా చెప్తాను” అని నవ్వుతూ వెళ్లిపోయారు. ఈవార్తలను ఆయన ఖండించలేదు. దాంతో ఏదో ఉంది అన్న అనుమానం మాత్రం అభిమానుల్లో కలిగింది.
ఈవిషయంపై ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అక్కినేని కుటుంబంలో త్వరలో శుభవార్త ఉండొచ్చన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ముందుగా నాగ చైతన్య, శోభిత జంట త్వరలోనే ఒక బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో షికారు కొట్టాయి.. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలియగానే.. అందరి చూపు అఖిల్ వైపు మళ్లింది. నాగార్జున సరైన టైమ్ లో అనౌన్స్ చేస్తాము అన్నది అఖిల్ గురించేనే అని అంతా గుసగుసలాడుకుంటున్నారు.
55
అఖిల్ కు అదృష్టం కలిసొస్తుందా?
ఈ నేపథ్యంలో శోభిత కాకపోతే జైనబ్ ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అయితే దీనిపై అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఇంత వరకూ సాలిడ్ హిట్ కొట్టలేదు అఖిల్.. సరైన కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోవడం అఖిల్ అభిమానుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆయన గత చిత్రం ‘ఏజెంట్’ కూడా కమర్షియల్‌గా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ‘లెనిన్’ సినిమాతో అయినా హిట్ కొట్టి.. సాధిస్తాడేమో చూడాలి.