ఈరోజు ఎపిసోడ్ రామచంద్ర ఇంటికి వచ్చి 20 లక్షలు ఎలా అరేంజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ చరణ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు రామచంద్ర. ఇప్పుడు ఏం చేయాలి సమయానికి జానకి గారు కూడా నాకు సలహా ఇవ్వడానికి లేదు అనుకుంటుండగా ఇంతలోనే జానకి ఫోన్ చేస్తుంది. అప్పుడు రామచంద్ర జానకి గారు మీకు 100 ఏళ్ళు ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను అనగా నేను మధ్యాహ్నం నుంచి మీ గురించి అనుకుంటున్నాను అని అంటుంది జానకి.