అప్పుడు మల్లిక,జానకి శ్రద్ధగా చదువుకుంటుంది,నన్ను పట్టించుకోవట్లేదు నేనే వెళ్లి కలవాలి అని జానకి ఎదురుగుండా కావాలని కింద పడినట్టు నటించి అరుస్తూ ఉంటుంది. కంగారుగా చికిత, జానకి ఇద్దరు అక్కడికి వచ్చి ఏమైంది అని అడగగానే,నొప్పి తట్టుకోలేకపోతున్నాను జానకి బాగా నొప్పెడుతుంది అబ్బా! అమ్మా! అని అరుస్తుంది.ఆసుపత్రి కి వెళ్దాం అని జానకి అనగా మల్లిక మనసులో, ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తే నా కడుపు తెలిసిపోతుంది ఏమో అని భయపడి, వద్దు జానకీ నూనె రాస్తే తగ్గుతుందేమో అని అనగా నూనె తెస్తాను అని జానకి అంటుంది.