Akhil Akkineni: రెండు సర్జరీలు, 48 కుట్లు, అఖిల్ అక్కినేని మూడేళ్ల గ్యాప్ వెనుక ఇంత విషాదం ఉందా?

Published : Jul 03, 2026, 09:27 PM IST

కెరీర్ బిగినింగ్ నుంచి సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సక్సెస్ సాధించలేకపోయాడు. ఏజెంట్ తరువాత సినిమాలకు మూడేళ్లు గ్యాప్ ఇచ్చాడు అఖిల్.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు?

PREV
15
మూడేళ్ల గ్యాప్ తరువాత తెరపైకి అఖిల్..

అఖిల్ అక్కినేని సినిమా చేసి చాలా కాలం అవుతోంది. పెళ్ళి తరువాత అసలు తెరపై కనిపించలేదు అఖిల్. అతను ఏమయ్యాడు.. ఎక్కడున్నాడని అభిమానులు వెతుక్కోడం మొదలు పెట్టారు. సినిమాలకు గుడ్ బై చెప్పాడేమో అని చాలామంది అనుకున్నారు. పవర్ ఫుల్ కమ్ బ్యాక్ కోసం ప్రిపేర్ అవుతున్నాడని మరికొందరు అనుకున్నారు. అందరి అనుమానాలు బ్రేక్ చేస్తూ.. త్వరలో లెనిన్ మూవీతో రాబోతున్నాడు అఖిల్. ఈసారి రెట్టింపు ఉత్సాహంతో రంగంలోకి దిగాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నాడు.

25
లెనిన్ సినిమా ప్రమోషన్లతో అఖిల్ బిజీ బిజీ..

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న 'లెనిన్' మూవీ జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమ్ అంతా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈక్రమంలోనే అఖిల్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత అనుభవాలను కూడా ఆడియన్స్ తో షేర్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో మాట్లాడిన అఖిల్ సినిమాలకు మూడేళ్లు గ్యాప్ ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు క్లారిటీ ఇచ్చాడు.

35
మూడేళ్లు గ్యాప్ రావడంపై అఖిల్ క్లారిటీ..

ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ.. 'ఏజెంట్' సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను దాదాపు మూడు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాను. దానికి చాలా పెద్ద కారణం ఉంది. ఏజెంట్ రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత నేను తర్వాత ప్రమాదవశాత్తు బాత్రూమ్‌లో జారి పడ్డాను. 

ఆ ప్రమాదంలో గాజు ముక్కలు ఎడమ చేతికి గుచ్చుకోవడంతో చాలా పెద్ద గాయం తగిలింది.ఆ గాయం కారణంగా ఎడమ చేతి వేళ్లకు రెండు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఆ ఆపరేషన్ లో మొత్తం 48 కుట్లు పడ్డాయి, గాయం తీవ్రత కారణంగా ఎనిమిది నెలల పాటు బరువులు కూడా ఎత్తలేకపోయాను'' అని అన్నాడు.

45
మళ్లీ గ్యాప్ రాదని అక్కినేని హీరో హామీ..

అఖిల్ మాట్లాడుతూ.. ''గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 16 నెలల సమయం పట్టింది. అందుకే సినిమాలకు మూడు సంవత్సరాల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ గ్యాప్ కారణంగా అభిమానులు నాపై కోపంగా ఉన్నారని తెలుసు. ఇకపై ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకుంటానని, అభిమానులకు హామీ ఇస్తున్నాను. మళ్ళీ గ్యాప్ వస్తే మా ఇంటికి వచ్చేయండి'' అని అఖిల్ హామీ ఇచ్చాడు. అఖిల్ గాయం గురించి తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.

55
లెనిన్ రిలీజ్ ఎప్పుడు?

తన కొత్త చిత్రం 'లెనిన్' గురించి కూడా అఖిల్ మాట్లాడాడు. ''ఈ సినిమా కథ వినగానే తనకు కొత్త అనుభూతి కలిగింది, అందుకే వెంటనే ఈ ప్రాజెక్టుకు అంగీకరించాను. కథలో ఉన్న కొత్తదనం నన్ను ఆకట్టుకుంది'' అని అఖిల్ అన్నారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 10న విడుదల కానున్న ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లో కీలకంగా మారనుంది.

Read more Photos on
click me!

Recommended Stories