ఇక నా కెరీర్ పరంగా చూస్తే గత సినిమా చోర్ బజార్ అంతగా ఆదరణ పొందలేదు. అందుకే ఈసారి నేను చేసే సినిమాను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని అనుకుంటున్నాను. ఓ లవ్ స్టోరీ, మరో యాక్షన్ మూవీ కథలు విన్నాను. అవి ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాం. ప్రాజెక్ట్ లాక్ అయ్యాక మీకు వివరాలు చెబుతాను. నేను ఈసారి చేసే సినిమా కిడ్స్, ఫ్యామిలీ, యూత్ అందరికీ నచ్చేలా చూసుకుంటాను.