Puri Jagannadh: ఛార్మి కోసం పూరి జగన్నాధ్ విడాకులకు రెడీ అయ్యారా ? ఆకాష్ పూరి అదిరిపోయే సమాధానం..

Published : Jun 22, 2022, 10:23 AM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. నిర్మాతల ఫ్రెండ్లీ డైరెక్టర్ పూరి జగన్నాధ్. బడ్జెట్ హద్దులు దాటకుండా తక్కువ టైంలో మంచి అవుట్ పుట్ తో పూరి సినిమాలు చేస్తుంటారు.

PREV
16
Puri Jagannadh: ఛార్మి కోసం పూరి జగన్నాధ్ విడాకులకు రెడీ అయ్యారా ? ఆకాష్ పూరి అదిరిపోయే సమాధానం..

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. నిర్మాతల ఫ్రెండ్లీ డైరెక్టర్ పూరి జగన్నాధ్. బడ్జెట్ హద్దులు దాటకుండా తక్కువ టైంలో మంచి అవుట్ పుట్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. భారీ కథలపై ఎక్కువగా ఆధారపడకుండా పూరి జగన్నాధ్ తన టేకింగ్ నే నమ్ముకుంటారు.  

26

పూరి జగన్నాధ్ ఎలాంటి వివాదాలని కొనితెచ్చుకోరు కానీ.. ఆయన గురించి చాలా రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఇటీవల పూరి జగన్నాధ్ ఎక్కువగా తన సొంత ప్రొడక్షన్ లోనే సినిమాలు చేస్తున్నారు. వైష్ణో అకాడమీ, పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థల్ని పూరి స్థాపించిన సంగతి తెలిసిందే. 

36

పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ప్రస్తుతం ఈ డాషింగ్ డైరెక్టర్ సినిమాలు చేస్తున్నారు. ఈ బ్యానర్ నిర్మాణ బాధ్యతలని క్రేజీ హీరోయిన్ ఛార్మి చూసుకుంటూ ఉంటుంది. ఛార్మి, పూరికి బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి గురించి చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. పూరి, ఛార్మి మధ్య ఎఫైర్ సాగుతోంది అంటూ కూడా వార్తలు వచ్చాయి. 

46

ఈ రూమర్స్ పై పూరి తనయుడు ఆకాష్ పూరి తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు. ఛార్మి కోసం పూరి జగన్నాధ్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. దీనిపై ఆకాష్ పూరి మాట్లాడుతూ .. నాన్న కొన్నేళ్ల క్రితం చాలా డబ్బు నష్టపోయారు. అది తీవ్ర నష్టం. నేను ఆ టైంలో మూడవ తరగతి చదువుతున్నా. కొద్ది రోజుల్లోనే అంతా మారిపోయింది. 

56

ఉంటున్న ఇల్లు కార్లు కూడా అమ్మేయాల్సి వచ్చింది. మాకు ఈ విషయాలు తెలియకూడదు అని అమ్మ మమ్మల్ని హాస్టల్ లో చేర్పించింది. దాదాపు ఐదేళ్ల పాటు మా పరిస్థితి నరకంగా ఉండేది. నాన్న తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యారంటే అందుకు కారణం అమ్మే. అలాంటి వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడం ఏంటి ? టైం పాస్ కోసం ఇలాంటి వార్తలు రాస్తుంటారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు అని ఆకాష్ పూరి కొట్టి పారేశాడు. 

66

మా తల్లిదండ్రులు ప్రేమలో ఉన్నప్పుడు నాన్న అమ్మకి ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం వస్తావా అని అడిగాడట. క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేస్తాను అని అమ్మ చెప్పిందట. నా జేబులో రూ 200 మాత్రమే ఉన్నాయి అంతకు మించి డబ్బు లేదు.. రేపు ఎలా ఉంటుందో చెప్పలేను అని అన్నారట. అదేం పర్వాలేదు.. వచేస్తానని అమ్మ చెప్పింది. ఇంతలా ప్రేమించుకునేవాళ్ళు నిజంగా ఉంటారా అని నాకు అనిపించింది. 

click me!

Recommended Stories