ఈరోజు ఎపిసోడ్ లో దేవి(devi), మాధవ కనిపించలేదు అని ఆదిత్యకు చెప్పుకొని బాగా ఎమోషనల్ అవుతుంది. దేవి ఏడుపును చూసి తట్టుకోలేక పోయిన ఆదిత్య (adithya)ఎలా అయినా మాధవను వెతికి తీసుకు వస్తాను అని మాట ఇస్తాడు. అందుకు దేవి సరే అని లోపలి కి వెళ్ళి పోగా ఆదిత్య మాత్రం బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు రామ్మూర్తి ఇంట్లో మాధవ గురించి రాధ తప్ప అందరూ బాధ పడుతూ ఉంటారు.