Ajith Thunivu Review: అజిత్ తెగింపు సినిమా ట్విట్టర్ రివ్యూ, వినోద్ డైరెక్షన్ లో హ్యాట్రిక్ కొట్టినట్టేనా...?

First Published | Jan 11, 2023, 6:00 AM IST

తమిళ స్టార్ సీనియర్ హీరో అజిత్ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తునివు.. తెలుగులో  తెగింపు పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అవుతోంది. ఈక్రమంలో ట్విట్టరో లో ఈ మూవీ ని.. ప్రీమియర్స్ ద్వారా ముందుగా చూసిన ఓవర్  సిస్ ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం. 

Ajith

 ఈ సంక్రాంతి కానుకగా తనకు ఎంతగానో కలిసొచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్‌ సినిమాతో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు అజిత్.  మరో తమిళస్టార్ హీరో విజయ్ తో పోటీపడబోతున్నాడు. హెచ్.వినోద్ డైరెక్షన్ లో వరుసగా హ్యాట్రిక్ మూవీ చేశారు తమిళ స్టార్ సీనియర్ హీరో అజిత్. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తునివు తెలుగులో  తెగింపు పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రిలీజ్ అవుతోంది. ఈక్రమంలో ట్విట్టరో లో ఈ మూవీ ని.. ప్రీమియర్స్ ద్వారా ముందుగా చూసిన ఓవర్  సిస్ ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం. 
 

అజిత్ తెగింగు సినిమాపై తమిళ, తెలుగు రాష్ట్రాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ట్రైలర్ అభిమానుల్లో అదిరిపోయే బజ్ క్రియేట్ చేసింది. అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అజిత్ చేసిన యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.  అంతే కాదు చాలా ఏళ్ళతరువాత మరో స్టార్ హీరో విజయ్ సినిమా కూడా పోటీకి నిలవడంతో.. ఈరెండు సినిమాల పోటీలో ఎవరు గెలుస్తారా అన్న ఆసక్తి అంతట నెలకోంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఉవ్విళ్లూరుతున్నారు. పొంగల్ కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అయ్యింది. 


ఇక తెగింపుకోసం తమిళ అభిమానులు తో పాటు తెలుగు వారు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్  సక్సెస్ పక్కా అని ఫ్యాన్స్ తో పాటు మూవీ టీమ్ కూడా కాన్ఫిడెంట్ తో ఉన్నారు. ఈ క్రమంలో ప్రీమియర్స్ రాత్రినుంచి సందడిచేయగా... సినిమా చూసిన ఆడియన్స్.. అజిత్ అభిమానులు ట్విట్టర్ లో ఏం రివ్యూ ఇస్తున్నారో చూద్దాం. 
 

ట్విట్టర్ లో ఆడియన్స్ హడావిడిచూస్తే.. అజిత్ హ్యాట్రిక్ కొట్టినట్టేతెలుస్తోంది. సినిమా అంతలా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది.దానికితగ్గట్టుగానే అన్నీ పాజిటీవ్ కామెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయిన ట్విట్టర్ లో. ముఖ్యంగా అజిత్ బెస్ట్ మూవీస్ లో ఇది ఒకటిగానిలిచిపోతుందంట కామెంట్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ కథతో ఎంతో లోతు ఉంటుందని. పరిశోధన చేసిన తరువాత తన కథ పుట్టుకొస్తుందంటూ..పొగిడేస్తున్నారు. 

కామన్ ఆడియన్స్ తో పాటు.. సెలబ్రిటీలు కూడా ఈసినిమా చూసి ట్వీట్ చేస్తున్నారు. అరుణ్ వీజయ్, రమేష్ బాల లాంటివారు సినిమాపై ట్విట్టర్ లో తమ అభిప్రాయం వెల్లడించారు. అజిత్ సార్ స్వాగ్.. అంటూ.. స్టార్ట్ చేసి.. ఆడియన్స్ కు ఇది మంచి ట్రీట్.. కథ, స్క్రీన్ ప్లే..ముఖ్యంగా అజిత్ సార్ యాక్టింగ్ సూపర్ అంటూ.. తెగపొగిడేశారు విజయ్, అటు రమేష్ బాల కూడా ... పక్కా మాస్ ఎంటర్టైనర్ అంటూ ట్వీట్ చేశారు. 

Thunivu Lyric Song Gangstaa thunivu ajith kumar H Vinoth manju warrier

ఈ సినినిమాలో అజిత్ వన్ మాన్ షో చేశాడంటున్నారు మరికొంత మంది ఫ్యాన్స్.  డైరెక్టర్ వినోద్ కుమార్ పై ప్రశంసలు కురిపిస్తూనే.. సినిమా అంతా అజిత్ ఒక్కడే దడదడలాడించేశాడన్నారు. అంతే కాదు యాక్షన్ థ్రిల్లర్ కథతో పాటు.. బ్యాంక్ స్కామ్స్ పేరుతో మంచి మెసేజ్ ను అందించే ప్రయత్నంచేశారంటూ.. పొగిడేస్తున్నారు ఆడియన్స్. 

విజయ్ వారీసు కూడా రిలీజ్ కు ఉండటంతో.. ఆసినిమాపై కూడా కాస్త సెటైరికల్ గా ట్వీట్లు కనిపించాయి. తెగింపు సినిమాలో మాస్స్ సీన్స్ గూస్ బాంబ్స్ తెప్పించాయని.. ఆసీన్స్ తో.. అజిత్ కుమార్ ఆపోజిట్ టీమ్ కునిద్ర లేకుండా చేస్తున్నాడంటై ఫ్యాన్స్ ట్వీట్ చేశారు. ఇలా అజిత్ సినిమాపై వరుసగా పాజిటీవు రివ్యూస్ కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.. చూస్తూంటే అజిత్ తునివు తో హ్యాట్రిక్ హిట్ గట్టిగానే కోట్టేట్టుకనిపిస్తున్నాడు.

బాక్సాఫీస్ బ్లాస్ అయ్యే సినిమా అంటూ.. అజిత్ తెగింపు సినిమాను ఆకాశానికి ఎత్తతున్నారు తమిళ తంబీలు. సిల్వర్ స్క్రీన్ పై మంటలు మంటలు పుట్టింస్తోన్నసినిమా తునివు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఓవర్సిస్ అభిమానులు. అయితే ఈసినిమాకు ట్విట్టర్ లో నెగెటీవ్ కామెంట్స్ అంటూ కనిపించడంలేదు. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటా పోటీగా రిలీజ్ అయ్యాయి. మరి బాక్సాఫీస్ వార్ ఎలా ఉంటుందో చూడాలి. 

Latest Videos

click me!