CM Vijay Thalapathy: తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్ చేసిన ఓ కీలక ప్రకటనపై.. మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతకీ ఏంటా ప్రకటన, అజిత్ రిలీజ్ చేసిన ప్రకటనలో ఏముంది.
తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రకటించారు. అసెంబ్లీలో రూల్ 110 కింద ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. దీనిపై నటుడు, కార్ రేసర్ అయిన అజిత్ కుమార్ ఓ ప్రకటన ద్వారా తన హర్షాన్ని, అభినందనలను తెలిపారు.
24
అజిత్ విడుదల చేసిన ప్రకటన
తమిళనాడు యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అజిత్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా, మోటార్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయడం తనకు చాలా సంతోషాన్ని కలిగిచ్చిందన్నారు. మోటార్ స్పోర్ట్స్‌తో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తిగా, ఈ ప్రకటనను భారత మోటార్ రేసింగ్ రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నానని అజిత్ తెలిపారు. సీఎం విజయ్ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
34
కొత్త మోటార్ స్పోర్ట్స్ సిటీ ఎలా ఉంటుంది?
తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ తయారీలో కీలక రాష్ట్రంగా ఉంది. ముఖ్యంగా కోయంబత్తూరులో అనేక మోటార్ స్పోర్ట్స్ వాహనాల తయారీ సంస్థలు పనిచేస్తున్నాయి. చెన్నై సమీపంలోని ఇరుంగాట్టుకోట్టైలో 'మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్', కోయంబత్తూరులో 'KARI మోటార్ స్పీడ్‌వే' రాష్ట్రంలోని ప్రధాన రేసింగ్ ట్రాక్‌లుగా ఉన్నాయి. ఇక్కడ జాతీయ స్థాయిలో F3, F4 కార్ రేసింగ్ పోటీలు జరుగుతాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో మోటార్ స్పోర్ట్స్ నగరాన్ని నిర్మించడం ద్వారా కొత్త అవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త నగరంలో అంతర్జాతీయ స్థాయి రేస్ ట్రాక్, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3, ఫార్ములా 4 వంటి అంతర్జాతీయ పోటీలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. దీనివల్ల క్రీడా పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.