Tegimpu Review: తెగింపు మూవీ రివ్యూ 

First Published Jan 11, 2023, 2:19 PM IST


అజిత్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ తెగింపు. వరల్డ్ వైడ్ జనవరి 11న విడుదలైంది. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కించగా, బోనీ కపూర్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన తెగింపు చిత్రం ఎలా ఉందో చూద్దాం... 
 

Tegimpu Review

కథ:
విశాఖపట్నం వేదికగా ఓ పెద్ద బ్యాంక్ రాబరీకి ముఠాలు ప్లాన్ చేస్తాయి.  అనుకోని అతిథిగా  డార్క్ డెవిల్(అజిత్ కుమార్) బ్యాంకులోకి ఎంటర్ అవుతాడు. ఎంప్లాయిస్, కస్టమర్స్ ని బందీలుగా చేసుకుంటాడు. అసలు ఈ డార్క్ డెవిల్ ఎవరు? అతడు యువర్ బ్యాంకుని టార్గెట్ చేయడానికి కారణం ఏమిటీ? డార్క్ డెవిల్ ని ప్రభుత్వం పట్టుకుందా? అనే ప్రశ్నల సమాహారమే తెగింపు చిత్రం... 

Tegimpu Review


హీరో అజిత్ దర్శకుడు హెచ్ వినోత్ ని మార్చకుండా ఆయనతో చిత్రాలు చేసుకుంటున్న పోతున్నారు. నెర్కొండ పార్వై, వలిమై తర్వాత వరుసగా మూడో చిత్రం తెగింపు వీరి కాంబినేషన్ లో తెరకెక్కింది. ఇక నిర్మాత కూడా సేమ్. శ్రీదేవికి ఇచ్చిన మాట ప్రకారం అజిత్ బోనీ కపూర్ తో చిత్రాలు చేస్తున్నారట. 
 

Tegimpu Review

ఇక దర్శకుడు వినోత్ పూర్తి స్థాయిలో నిరాశ పరచడం లేదు. అలాగని మొత్తంగా మెప్పించడం లేదు. అజిత్ కి ఆయన యావరేజ్ హిట్స్ ఇస్తున్నాడు. నేరకొండ పార్వై పింక్ రీమేక్. వలిమై, తెగింపు స్ట్రెయిట్ మూవీస్. ఆయన కథలు చాలా కొత్తగా ఉంటున్నాయి. స్టోరీ లైన్స్ మెప్పిస్తున్నాయి. వలిమై చిత్రాన్ని ఇంకా టైట్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది. వినోత్ ఆ ఛాన్స్ కోల్పోయాడు.

Tegimpu Review

అదే సూత్రం తెగింపు చిత్రానికి కూడా వర్తిస్తుంది. తెగింపు చిత్ర ఆరంభం అదిరింది. మంచి సెటప్ ఏర్పాటు చేశాడు. గొప్ప థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడబోతున్నామని ప్రేక్షకులు అనుకుంటారు. అయితే కొద్దిసేపటికే ఆ టెంపో మిస్ అవుతుంది. సినిమా స్లో అవుతుంది. 
 

వినోత్ కథలు గమనిస్తే సోషల్ ఇష్యూస్ ని టచ్ చేస్తూ కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కిస్తున్నారు. తెగింపు మూవీలో కూడా బ్యాంకింగ్ సంస్థల మోసాలను ప్రస్తావించారు. స్క్రీన్ ప్లే ఫెయిల్ కావడంతో మూవీ గతి తప్పింది. లాజిక్ లేని సీన్స్ కూడా ఎక్కువయ్యాయి. 

అజిత్ ఫ్యాన్స్ ని మెప్పించే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అజిత్ రోల్ నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. ఈ క్రమంలో ఆయన మేనరిజమ్స్ ఆకట్టుకుంటాయి. అభిమానులు ఆహా అనే మూమెంట్స్ సినిమాలో అక్కడక్కడా ఉన్నాయి. సాధారణ ప్రేక్షకులు మాత్రం లాజిక్ లేని డ్రామా కారణంగా బోర్ ఫీల్ అవుతారు.

మంచి స్టోరీ లైన్ ఎంచుకున్న దర్శకుడు ఆడియన్స్ ని మెప్పించే సన్నివేశాలు రాసుకొని ఉంటే బాగుండేది. కీలక రోల్స్ చేసిన మంజు వారియర్, జాన్ కొక్కెన్ మెప్పించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. జిబ్రాన్ బీజీఎమ్ సినిమాకు ప్లస్. మొత్తంగా తెగింపు అజిత్ అభిమానులకు మాత్రమే.

  నటీనటులు: అజిత్, మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖని, అజిత్ తదితరులు

దర్శకుడు : హెచ్ . వినోద్

నిర్మాత: బోనీ కపూర్

సంగీత దర్శకులు: జిబ్రాన్

సినిమాటోగ్రఫీ: నిరవ్ షా

ఎడిటర్: విజయ్ వెలికుట్టి  

రేటింగ్: 2.5/5
 

click me!