Brahmamudi Serial Today Episode: ఇందు జాబ్ పోగొట్టిన రాజు, ఐశ్వర్యను అరెస్టు చేసిన పోలీసులు

Published : Mar 16, 2026, 10:07 AM IST

Brahmamudi Serial Today Episode:బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. రాజు వల్ల ఇందు జాబ్ పోతుంది. పోలీసులు ఐశ్వర్యను అరెస్టు చేస్తారు. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం. 

PREV
16
రాజు డ్యాష్ ఇవ్వడంతో పగిలిపోయిన జ్యూస్ గ్లాస్

మత్తు మందు కలిపిన ఆరెంజ్ జ్యూస్ ఇందుకు ఇస్తాడు బాస్ రాఖీ. ఇంతలో రాజు, అతని ఫ్రెండ్ డాన్స్ చేసుకుంటూ ఇటు రాగా....రాఖీని డ్యాష్ ఇవ్వడంతో ఆరెంజ్ జ్యూస్ కిందపడి పగిలిపోతుంది. అప్పుడు ఇందు, రాజు ఒకరినొకరు చూసుకుని తిట్టుకుంటారు. డ్యాష్ ఇచ్చినదానికి సారీ చెప్పకుండా ఓవరాక్షన్ చేస్తున్నావేంటీ అని రాఖీ అంటాడు. పడిపోయిందేమీ బంగారమా, ప్లాటినమా...ఆఫ్‍ట్రాల్ ఆరెంజ్ జ్యూసే కదా అంటాడు రాజు. కావాలంటే ఇంకో రెండు కొనిస్తా అంటాడు. ఎంతసేపు డబ్బులు, వస్తువులు అంతేనా....ఎదుటి వాళ్ల ఫీలింగ్స్ పట్టించుకోవా అంటుంది ఇందు. ఏంటీ జ్యూస్ కోసం ఫీలవుతున్నావా? గుండెలకు హత్తుకుని ఓదార్చుకోవాలా అని అంటాడు రాజు..

26
బాస్ రాఖీని చెంప చెల్లుమనించిన రాజు

ఏంటిరా వాగుతున్నావ్ అని రాఖీ అంటాడు. రా ఏంటి రా....ఎలా పడితే అలా నోరు జారకు బ్రదర్ అని రాజు అంటాడు. ఏంటి ఇందు ఇదంతా అసలు ఎవడువీడు...ఇంత చీప్‌గా మాడ్లాడుతున్నాడని రాఖీ అంటే... అతనెవరో నాకు తెలీదని ఇందు అంటుంది. తెలియకుండానే ఇంత క్లోజ్‍గా మాట్లాడుతున్నారా , వీడి వాలకం చూస్తుంటే బస్తీ నుంచి వచ్చినట్లు ఉన్నాడని రాఖీ అనేస్తాడు. లోపలికి రానిచ్చినందుకు పబ్ వానర్‌ను తిట్టాలి అని రాఖీ అంటాడు. మార్కెట్‌లో కొనుక్కుని బట్టలు వేసుకుని వేస్తే నేను, మీరు సమానమవుతారా అని రాఖీ అంటాడు. ఇందు రాజుని తిడుతూ ఉంటే....ఇందుపై రాఖీ కోపమవుతాడు. మీ ఇద్దరికి ఏదైనా గొడవ ఉంటే మీరు మీరు చూసుకోవాలని గానీ నన్ను కొట్టిస్తావా అని రాకీ అంటాడు. ఇంకెప్పుడు నా కంపెనీలో ఉద్యోగం ఇవ్వనని చెప్తూ వెళ్లిపోతాడు.

36
రాజు, ఇందు మధ్య గొడవ

నాకు జాబ్ రాకుండా చేశావని ఇందు రాజుపై కోప్పడుతుంది. నా ఇంటర్వ్యూ మొత్తం నాశనం చేశావని అంటుంది. పబ్‍లో ఇంటర్వ్యూ చేస్తేనే వాడు ఎలాంటోడో అర్థమవుతుందని రాజు అంటాడు. ఇక ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ పడతాడు. రాజును ఛీకొట్టి ఇందు వెళ్లిపోతుంది. 

46
సెల్‍ఫోన్ స్మగ్లర్‍ను పట్టుకున్న నందు

మరోవైపు సెల్‌ఫోన్ స్మగ్లర్‍ను వెంటాడుతుంది నందు. వెంకీని వెంటపట్టుకుని అతన్ని ఇబ్బంది పెట్టి ఈడ్చుకొస్తుంది. స్మగ్లర్ ఫోన్ అమ్ముతుండగా పట్టుకుంటుంది. అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్‍ను తీసుకెళ్తుంది. 

56
లిఫ్ట్ దగ్గర ఐశ్వర్యను చూసి దాక్కున్న ఇందు

జాబ్ పోయిందని ఇందు బాధపడుతూ...సరే త్వరగా ఇంటికైనా వెళ్లిపోదామని లిఫ్ట్ దగ్గరికి వస్తుంది. ఇంతలో ఐశ్వర్య తాగిన మత్తులో వస్తుండగా ఇందు చూసి దాక్కుంటుంది. ఐశ్వర్య లిఫ్ట్ లో దిగిపోగా ఇందు మెట్లపైనుంచి దిగుతుంది. ఐశ్వర్య కారు స్టార్ట్ అవ్వదు. ఏం చేయాలో తెలియక దిగిపోతుంది. ఇంతలో రాజు ఫ్రెండ్ లక్కీ చూసి...ఆ అమ్మాయిని డ్రాప్ చేస్తా...అప్పుడు నాకు హగ్ ఇస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్తాడు. పోలీసులు పట్టుకుంటారని రాజు చెప్తున్నా వినిపించకుండా వెళ్తాడు లక్కీ. ఇద్దరూ బైక్‍పై వెళ్తుండగా పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‍కు తీసుకెళ్తారు. పోలీసులు స్టేషన్‍కు తీసుకెళ్తుండగా ఇందు చూస్తుంది. వెంటనే స్వాతికి ఇందు ఫోన్ చేసి ఐశ్వర్యను పోలీసులు తీసుకెళ్లారని చెబుతుంది.

66
డ్రంక్ అండ్ డ్రైవ్‍లో దొరికిన లక్కీ, ఐశ్వర్య

ఇక పోలీస్ స్టేషన్‍కు స్మగ్లర్‍ను తీసుకొస్తుంది నందు. అప్పుడే లక్కీని, ఐశ్వర్యను పోలీసులు స్టేషన్‍కు తీసుకొస్తారు. FIR కాపీ రాయమని ఎస్సై చెప్తాడు. అప్పుడు నందు...వాళ్ల బాబాయ్ కానిస్టేబుల్‍ను తీసుకుని FIR రాయడానికి వెళ్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.  

Read more Photos on
click me!

Recommended Stories