అజయ్ చెప్పిన ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అజయ్ అంటే పుష్పలో అల్లు అర్జున్ ను దూరం పెడుతూ.. బాధపెట్టే అన్నగా నటించాడు. చాలా సినిమాల్లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అజయ్ అందరికి పరిచయమే. ఎక్కువగా పోలీస్ పాత్రలు చేసిన అజయ్.. విలన్ గా అందరిని మెప్పించాడు.
విక్రమార్కుడు సినిమాల్ టిట్లగా అజయ్ జీవితంలోనే మర్చిపోలేని పాత్ర చేశాడు. విక్రమార్కుడు తరువాత అజయ్ కు వరుస అవకాశాలు వచ్చాయి. అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ చూశాడు అజయ్. ఒక టైమ్ లో అజయ్ లేని సినిమా లేదు అంటే చూసుకోవచ్చు. ఈమధ్య అజయ్ పెద్దగా కనిపించడంలేదు.
ఆయన చేసిన పెద్ద సినిమా అంటే పుష్ప మాత్రమే. అజల్ లో కూడా చాలా మార్పు వచ్చింది. ఇక ఏమైందో ఏమో తెలియదు కాని. అజయ్ కు సినిమాలు తగ్గాయి. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తున్నాడు అజయ్. ఆమధ్య చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ఈమధ్యే మళ్లీ కనిపిస్తున్నాడు అజయ్.