ఒకసారి నేను బాపినీడు గారిని కలవడానికి ఆయన ఆఫీస్ కి వెళ్ళాను. అప్పటికి ఎన్టీఆర్ నటించిన నిన్ను చూడాలని చిత్రం రిలీజై ఉంది. ఆ సినిమా ఫ్లాప్. అనుకోకుండా అక్కడ నిన్ను చూడాలని కలెక్షన్స్ గురించి చదివా. ఆ చిత్రం 80 లక్షలు వసూలు చేసినట్లు రాశారు. మనం 30 లక్షలు, 40 లక్షలు కలెక్షన్స్ రాబట్టడానికి చాలా తంటాలు పడుతున్నాం. ఇదేంటి ఈ చిత్రానికి 80 లక్షలు వచ్చాయి అని ఆశ్చర్యపోయా. వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు బెల్లంకొండ సురేష్ తెలిపారు.