'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' నిర్మాతతో ఘనంగా బిగ్ బాస్ శుభశ్రీ నిశ్చితార్థం..అతిథులు ఎవరెవరో తెలుసా

Published : Jun 06, 2025, 08:05 PM IST

ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్, నటి, బిగ్ బాస్ 7 ఫేమ్ శుభశ్రీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

PREV
110

ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్, నటి, బిగ్ బాస్ 7 ఫేమ్ శుభశ్రీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు సాయి కుమార్, యువ హీరో సోహైల్, బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొని ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.

210

అజయ్ మైసూర్, శుభశ్రీ నిశ్చితార్థ వేడుకలో మెహందీ, రిసెప్షన్ కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. బిగ్ సీజన్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొన్న శుభశ్రీ నెల రోజుల పాటు హౌస్ లో గడిపింది. 

310

ఈ నిశ్చితార్థ వేడుకలో అజయ్ మైసూర్, శుభశ్రీ కలిసి చేసిన మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ ను లాంచ్ చేశారు. సాయి కుమార్ వాయిస్ తో ఈ పాట ప్రారంభం కావడం ఆకర్షణగా నిలిచింది. మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ ను సిద్ధార్థ్ వాట్కిన్స్ స్వరపరచి సింగర్ సాహితీ చాగంటితో కలిసి పాడారు. 

410

ఈ పాట రూపకల్పన సమయంలోనే వీరి మనసులు కలిసి ప్రేమించుకున్నారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిశ్చయించుకున్నారు. జూలైలో అజయ్ మైసూర్, శుభశ్రీ  వివాహం ఆస్ట్రేలియాలో జరగనుంది.

510

ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో సాయికుమార్ మాట్లాడుతూ.. అజయ్ మైసూర్ నాకు మంచి మిత్రులు. మా ఇంటికి వచ్చి వారి ఎంగేజ్మెంట్ కోసం ఆహ్వానించారు. ఈ జంట చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని శుభాకాంక్షలు అందజేశారు. 

610

హీరో సోహైల్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, స్నేహితులు, ఇతర సెలబ్రిటీలు ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో సందడి చేశారు. మెజెస్టీ ఇన్ లవ్ సాంగ్ కు పనిచేసిన టీమ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొని పాట పాడి వీక్షకులను అలరించారు.

710

ప్రొడ్యూసర్ అజయ్ మైసూర్ అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, 10th క్లాస్ డైరీస్ వంటి చిత్రాలతో పాటు పలు షార్ట్ ఫిలిమ్స్, 50కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ నిర్మించబడ్డాయి.

810

శుభశ్రీ రుద్రవీణ, కథ వెనుక కథ, అమిగోస్, సందేహం లాంటి చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో గ్లామరస్ ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది.

910

ఇక నిర్మాత అజయ్ మైసూర్ విషయానికి వస్తే.. ఆయన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు లాంటి వివాదాస్పద చిత్రాన్ని నిర్మించి వార్తల్లో నిలిచారు. అజయ్ కి రాంగోపాల్ వర్మతో మంచి సంబంధాలు ఉన్నాయి. 

1010

శుభశ్రీ, అజయ్ నిశ్చితార్థ వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు అమర్ దీప్, టేస్టీ తేజ, సిరి హనుమంత్, యావర్, ఆర్జే కాజల్ లాంటి వారు హాజరయ్యారు.  

Read more Photos on
click me!

Recommended Stories