photo credit - aishwarya rajesh instagram
ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) తెలుగు ఫ్యామిలీ అమ్మాయి అయినా చెన్నైలో పెరిగింది. కోలీవుడ్ హీరోయిన్‌గా ఎదిగింది. ఓ వైపు అడపాదడపా కమర్షియల్ మూవీస్ చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పిస్తుంది. ఈ ఏజ్‌లోనే మహిళా ప్రధాన చిత్రాలు చేస్తూ మెప్పిస్తుంది. విజయాలు అందుకుంటుంది.
photo credit - aishwarya rajesh instagram
ఆ విషయంలో ఐశ్వర్య రాజేష్ టాలెంట్ పై ప్రశంసలు కురిపించాల్సిందే. స్టార్ హీరోల మాదిరిగా సినిమా బాధ్యతని తన భుజాలపై మోస్తూ ఆడియెన్స్ ని థియేటర్‌కి రప్పించడమంటే మాటలు కాదు. ఆ విషయంలో ఐశ్వర్య సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.
photo credit - aishwarya rajesh instagram
నటనతో మ్యాజిక్ చేసే ఈ బ్యూటీ గ్లామర్ షో విషయంలో ఎప్పుడూ హద్దులు దాటలేదు. వెండితెరపై అందంగా కనిపించింది కానీ స్కిన్‌షో చేయలేదు. నటనతో కట్టిపడేసే ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం క్రమంగా తన నియమాలను పక్కన పెడుతుంది. కొద్ది కొద్దిగా హింట్ ఇస్తుంది.
photo credit - aishwarya rajesh instagram
ఆ మధ్య ట్రెండీ వేర్‌లో మెరిసిన ఈ భామ ఇప్పుడు మరింత హాట్‌గా కనిపిస్తుంది. క్లోజప్‌లో అందాల విందు చేస్తుంది. మరోవైపు కన్నుకొడుతూ కవ్వింపులకు దిగింది. కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ర్యాండప్ పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా వైరల్ అవుతుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి.
ఐశ్వర్య రాజేష్.. తెలుగులో ఐదు సినిమాలు చేసింది. కానీ ఏదీ సక్సెస్ కాలేదు. `కౌసల్య కృష్ణమూర్తి`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్. ఇందులో క్రికెటర్ గా నటించింది. ఉమెన్ ఎంపావర్‌మెంట్‌ని చాటి చెప్పింది. కానీ ఈ చిత్రం ఆడలేదు.
దీంతోపాటు విజయ్ దేవరకొండతో `వరల్డ్ ఫేమస్ లవర్`, సాయిధరమ్ తేజ్‌తో `రిపబ్లిక్`, నానితో `టక్ జగదీష్`, అలాగే `మిస్ మ్యాచ్` అనే చిత్రంలో నటించింది. ఇవన్నీ నిరాశ పరిచాయి. దీంతో ఐశ్వర రాజేష్.. ఇక తెలుగుకి గుడ్ బై చెప్పింది.
అయితే తెలుగులో పెద్ద హీరోలతో నటించే ఆఫర్లు రావడం లేదని, కమర్షియల్ చిత్రాల్లో తనని తీసుకోవడం లేదని, మంచి ఆఫర్లు రావడం లేదని కంప్లెయింట్ కూడా చెప్పింది ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం కోలీవుడ్‌కే పరిమితమై అక్కడ దూసుకుపోతుంది. మలయాళంలోనూ జోరు పెంచిందీ డస్కీ బ్యూటీ.