ఆమె నాని హీరోగా నటించిన `కృష్ణగాడి వీర ప్రేమ గాథ` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకుంది. `మహానుభావుడు`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో విజయాలు అందుకున్నారు. కానీ `కేరాఫ్ సూర్య`, `జవాన్`, `పంతం`, `నోటా`, `కవచం`, `ఎఫ్2`, `చాణక్య`, `ఎంత మంచి వాడవురా`, `అశ్వత్థామ`, `మంచి రోజులొచ్చాయి`, `ఎఫ్3` చిత్రాలు చేసింది. ఇందులో `ఎఫ్2` మాత్రమే హిట్ అయ్యింది. దీంతో ఆమె కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది. మళ్లీ పుంజుకునే పనిలో బిజీగా ఉందీ ఆపిల్ బ్యూటీ.