వైట్ డ్రెస్ లో విరబూసిన జాబిల్లిలా.. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తున్న ఐశ్వర్య రాజేశ్

First Published | Sep 17, 2023, 5:35 PM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ నెట్టింట బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 
 

తమిళ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) పలు చిత్రాలతో తెలుగులోనూ అలరించింది. బాల నటిగానే తెలుగులో ‘రాంబంటు’ చిత్రంలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కోలీవుడ్ చాలా సినిమాలు చేసింది. టాలీవుడ్ లోనూ అలరిస్తోంది.
 

ప్రస్తుతం ఐశ్వర్య రాజేశ్ కోలీవుడ్ లో చేతి నిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లతో అలరిస్తూనే వస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. నటిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటోంది. 


తెలుగులోనూ ఐశ్వర్య రాజేశ్ ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘మిస్ మ్యాచ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’, ‘రిపబ్లిక్’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాల్లోనే నటిస్తోంది. తెలుగులోనూ ఆఫర్లు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది.
 

ఇదిలా ఉంటే.. ఐశ్వర్య రాజేశ్ సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉంటోంది. క్రేజీగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. మరోవైపు అదిరిపోయే ఫొటోషూట్లతోనూ ఆకట్టుకుంటోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. గ్లామర్ షోకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని డస్కీ బ్యూటీ సంప్రదాయ దుస్తుల్లోనే మెరుస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా లాంగ్ వైట్ ఫ్రాక్ లో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ గా మెరిసి ఆకట్టుకుంది. 

ట్రెడిషనల్ లుక్ లో మెరిసినా అదిరిపోయే ఫోజులతో కట్టిపడేసింది. విరబూసిన జాబిల్లిలా ఆకర్షించింది. దీంతో లైక్, కామెంట్లతో ఫ్యాన్స్ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఐశ్వర్య రాజేశ్ ప్రస్తుతం ‘మోహన్ దాస్’, ‘తీయవర్ కులైగల్ నడుంగ’, ‘పులిమేడ’, ‘హెర్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

Latest Videos

click me!