బ్లాక్‌ గౌన్‌లో పూల బోకే పెట్టుకుని రెడ్‌ కార్పెట్‌ని షేక్‌ చేసిన ప్రపంచ సుందరి.. కాన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌

Published : May 19, 2022, 07:53 AM IST

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ మరోసారి రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. కాన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ఫ్యాషన్‌ దుస్తుల్లో హోయలు పోయింది. ఆమె రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేస్తే ప్రపంచ వేదిక తన్మయత్వం చెందడం విశేషం. ప్రస్తుతం ఆమె ఫోటోలు ట్రెండ్‌ అవుతున్నాయి. 

PREV
110
బ్లాక్‌ గౌన్‌లో పూల బోకే పెట్టుకుని రెడ్‌ కార్పెట్‌ని షేక్‌ చేసిన ప్రపంచ సుందరి.. కాన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌
aishwarya rai cannes 2022 red carpet

ఐశ్వర్య రాయ్‌(Aishwarya Rai Cannes) గత 20ఏళ్లుగా ఆమె కాన్‌(Cannes Film Festival 2022) ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేస్తుంది. 2002 నుంచి రెగ్యూలర్‌ పార్టిసిపెంట్‌గా ఉంటూ వస్తున్నారు. మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు గ్యాప్‌ వచ్చినా, ఐష్‌ అంటే కాన్‌లో ఎప్పుడూ ప్రత్యేక అతిథినే. ఆమె ఎప్పుడు మెరిసినా అది హైలైట్‌ అవ్వాల్సిందే. కాన్‌ (Cannes) చిత్రోత్సవానికే కొత్త కళ తీసుకొస్తుంది ఐశ్వర్య రాయ్‌. 

210
aishwarya rai cannes 2022 red carpet

తాజాగా ఆమే కాన్‌(Cannes) 2022లో సందడి చేసింది. రెండు రోజుల క్రితమే ఆమె తన కూతురుతో ఆరాధ్య తో కలిసి కాన్‌కి చేరుకుంది. అక్కడ తొలి రోజు ఫెస్టివల్‌ వేదిక బయట అందమైన వీధుల్లో హోయలు పోయింది. ఫోటోలకు పోజులిస్తూ కనువిందు చేసింది. 
 

310
aishwarya rai cannes 2022 red carpet

ఇక బుధవారం(మే 18)సాయంత్రం ఆమె రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ (Aishwarya Rai Red Carpet)చేసింది. బ్లాక్‌ గౌన్‌కి పూల బొకే తగిలించినట్టుగా ఉన్న ఫ్యాషన్‌ వేర్‌లో హోయలు పోయింది ఐశ్వర్య రాయ్‌. ఆమె తనదైన పోజులతో అందరిని మంత్రముగ్దుల్ని చేసింది. ఫెస్టివల్‌కి కొత్త కళ తీసుకొచ్చింది. 

410
aishwarya rai cannes 2022 red carpet

ఐశ్వర్య రాయ్‌ అందాలను బంధించేందుకు కెమెరా కన్నులు పోటీ పడగా, ఆమె ఇచ్చిన క్యూట్‌ అండ్‌ హాట్‌ పోజులు హైలైట్‌గా నిలిచాయి. వయ్యారంగా వాక్‌ చేస్తూ ఆద్యంతం అలరించింది మాజీ విశ్వసుందరి. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

510
aishwarya rai cannes 2022 red carpet

ఐశ్వర్య రాయ్‌ హలీవుడ్‌ వంటి పలు అంతర్జాతీ భాషల్లోనూ సినిమాలు చేసింది. దీంతో అంతర్జాతీయ సెలబ్రిటీలకు ఆమె బాగా పరిచయం మోస్ట్, అండ్‌ హైలీ ప్రొఫైల్‌ యాక్టర్‌గా ఉన్నారు ఐశ్వర్య. అందుకే ఆమె వచ్చిందంటే ఓ స్పెషల్‌ అట్మాస్మియర్‌ నెలకొంటుంది. నిన్న సాయంత్రం కూడా అదే జరిగింది. 

610
aishwarya rai cannes 2022 red carpet

తన అందంతో కాన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ని ఐశ్వర్య షేక్‌ చేసిందని అంటున్నారు నెటిజన్లు. అందాల దేవత దిగొచ్చినట్టుగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతటి అందం చూడతరమా, ఈ అందాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదంటూ పోస్ట్ లు పెడుతున్నారు. 

710
aishwarya rai cannes 2022 red carpet

కాన్ 2022 (75వ కాన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌) వేడుకలో రెండో రోజు ఐశ్వర్య రాయ్‌తోపాటు పూజా హెగ్డే కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. ఆమె కూడా రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేసి ఆద్యంతం కనువిందు చేసింది. దీపికా పదుకొనె మొదటి రోజే రెడ్‌ కార్పెట్‌పై మెరవగా, తమన్నా, ఇతర ఇండియ్‌ కథానాయికలు సందడి చేయబోతున్నారు. 

810
aishwarya rai cannes 2022 red carpet

ఇక ఈ సారి కాన్‌ వేడుకలో ఇండియన్‌ సినిమాకి ప్రత్యేకస్థానం దక్కింది. స్పెషల్‌గా ఇండియా కోసం ఒక పెవిలియన్‌ లాబీని ఏర్పాటు చేశారు. దీంతో  కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మాధవన్‌, రెహ్మాన్‌, శేఖర్‌ కపూర్‌, రిక్కీ కేజ్‌, ప్రసూన్‌ జోషీ, వాణీ త్రిపాఠి పాల్గొన్నారు. ఇందులో కమల్‌ హాసన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

910
aishwarya rai cannes 2022 red carpet

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌(2022)లో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌లో ట్రెండీ ఔట్‌ఫిట్‌లో రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేస్తూ ఇచ్చిన పోజులు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

1010
aishwarya rai cannes 2022 red carpet

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌(2022)లో ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌లో ట్రెండీ ఔట్‌ఫిట్‌లో రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేస్తూ ఇచ్చిన పోజులు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories