కత్రినా, ఐశ్వర్య రాయ్, సోనాక్షీ.. సంగీత.. సల్మాన్ ఖాన్ ఖాతాలో బ్రేకప్ లవ్ స్టోరీస్ ఎన్నో..

Published : Apr 15, 2023, 06:39 PM ISTUpdated : Apr 15, 2023, 06:43 PM IST

56 ఏళ్ళు వచ్చినా.. ఇంకా పెళ్ళి చేసుకోలేదు.. బాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో సల్మాన్ ఖాన్. పెళ్ళి అయితే చేసుకోలేదు కాని.. ఆయన ఖాతాలో లవ్ స్టోరీలెన్నో.. స్టార్ హీరోయిన్లంతా... సల్మాన్ ప్రేమలో మునిగి తేలినవారే. కొందరైతే సల్మాన్ తో.. సహజీవనమే చేశారు. కాని పెళ్ళి విషయంలో మాత్రం సల్మాన్ ఖాన్.. బ్యాచిలర్ గానే మిగిలిపోయాడు. కొన్ని సార్లు పెళ్ళి వరకూ వచ్చి ఆగిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి సల్మాన్ లైఫ్ లో.

PREV
112
కత్రినా, ఐశ్వర్య రాయ్, సోనాక్షీ.. సంగీత.. సల్మాన్ ఖాన్ ఖాతాలో బ్రేకప్ లవ్ స్టోరీస్ ఎన్నో..

పెళ్లి చేసుకోకపోయినా.. చాలా మంది హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు సల్మాన్. ఆయన పేరు చెపితే.. ఐశ్వర్య, కత్రీనా ఎక్కువగా గుర్తుకు వస్తారు.. కాని సల్మాన్ ఖాతాలు పదిమందిపైనే ఉన్నారు మరి. సల్మాన్ తో ప్రేమాయనం నడిపించిన హీరోయిన్లు ఎవరు.. ? రూమర్డ్ గల్ ఫ్రెండ్స్ ఎవరు..? చూసేద్దాం రండి. 

212

ప్రస్తుతం సల్మాన్ ఖాన్.. పూజా హెగ్డేతో కిసికా బాయ్ కిసికి జాన్ సినిమా చేస్తున్నాడు. వీరిమధ్య ప్రేమాయణం నడుస్తుందని టాక్ గట్టిగా ఉంది. ఈ విషయంలో పూజా హెగ్డే ఏమన్నా.. సల్మాన్ తో లవ్ అంటూ రూమర్ వస్తే.. అది అలా ఫిక్స్ అయినట్టే. ఇందులో నిజం ఎంత..అబద్దం ఎంతా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ రూమర్ దేశమంతా వ్యాపించింది. 
 

312

సల్మాన్ ఖాన్ ప్రేమాయణాల్లో ఎక్కువగా వనిపించిన పేరు కత్రీనా కైఫ్. సల్మాన్ తో  ఈమె 4 ఏళ్ళ పాటు సహజీవనం చేసింది. తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి రణబీర్ కపూర్ తో ప్రేమలో పడింది. రణ్ బీర్ తో కూడా కొన్నాళ్లు తిరిగి..  ఫైనల్ గా బాలీవుడ్ యంగ్ హీరో  విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుని సెటిలైంది.
 

412

In an interview, Somy Ali was asked about her relationship with Salman and what led to their break up. When asked who came between Salman and her, she said, "Aishwarya Rai."

మాజీ మిస్ వరల్డ్.. అమితాబ్ కోడలు.. ఐశ్వర్య రాయ్ కూడా సల్మాన్ తో  డేటింగ్ వ్యవహారం నడిపింది.సల్మాన్ బిహేవియర్  కారణంగా బ్రేకప్ అయినట్టు  ఐష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతే కాదు తనను చాలా సార్లు సల్మాన్ కొట్టినట్టు కూడా వెల్లడించింది బాలీవుడ్ సీనియర్ బ్యూటీ. ఫైనల్ గా ఈమె అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుని.. బచన్ ఫ్యామిలీ కోడలైపోయింది. 

512

బాలీవుడ్ లో స్టార్ వారసురాళ్ళను కూడా వదల్లేదు సల్మాన్. శత్రుఘ్న సిన్హా  కూతురు సోనాక్షి సిన్హా కూడా దబాంగ్ సినిమా టైంలో సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య కాస్త  సీరియస్ రిలేషన్ షిప్ న కొనసాగింది.  అంతే కాదు వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని.. దాదాపు అది ఫైనల్ అయినట్టు వార్తలు వినిపించాయి. కాని ఎందుకో ఏమో కాని.. వీళ్లు విడిపోయారు. 
 

612

మరో వారుసురాలు.. బాలీవుడ్ సూపర్ స్టార్ అశోక్ కుమార్ మనవరాలు షహీన్ తో సల్మాన్ కొంత కాల శృతి కలిపారు. అయితే అది సినిమాల టైమ్ లో కాదు.. కాలేజి టైమ్ లో.. చదువుకొనే రోజుల్లో సల్మాన్ ఈమె ప్రేమలో పడ్డాడని.. సల్మాన్ ఖాన్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో వార్తలు వచ్చాయి.  కాని ఆతరువాత ఏమైయిందో తెలియదు. ఎలా విడిపోయారో కూడా తెలియదు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. సల్మాన్ ప్రేమించిన షహీన్ .. కియారా అద్వానీ కి అత్త అవుతుంది.
 

712

చివరికి పాకిస్తాన్ హీరోయిన్ ను కూడా వదిలిపెట్టలేదు సల్మాన్ ఖాన్. పాకిస్థాన్ నటి సోమీతో కూడా సల్మాన్ ఖాన్ ప్రేమ వ్యావహారం నడిపించాడు. కానీ కొంతకాలం తర్వాత వీరు బ్రేకప్ చెప్పేసుకుని విడిపోయారు. ఇక్కడ కూడా సల్మాన్ ఖాన్ బిహేవియర్ ప్రాబ్లమ్ ... ఈమె కూడా సల్మాన్..నన్ను వేధించాడు అంటూ ఆరోపణలు చేసింది.
 

812

రీసెంట్ గా తన బర్త్ డేకి వచ్చిన తన ఓల్డ్ హీరోయిన్ సంగీత బజ్లానీకి ముద్దు పెట్టి మరీ సాగనంపాడు సల్మాన్.. గతంలో వీరి మధ్య కూడా ఘడమైన  ప్రేమ వ్యవహారం నడిచిందట. పెళ్లి చేసుకునే వరకు వెళ్లారనే ప్రచారం జరిగింది. 1994 ,మే 27న వీరి పెళ్లి జరిగిపోవాలి. కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. అయితే అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయో ఏమో.. మొన్న బర్త్ డే రోజు ఆమెను ప్రేమగా ముద్దాడాడు సల్మాన్. 
 

912

మన టాలీవుడ్ లో సినిమాలు చేసి.. ప్రస్తుతం కనమరుగయిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కూడా సల్మాన్ ఖాన్ డేటింగ్ లిస్ట్ లో ఉంది.   ఈమెలో ఐశ్వర్య రాయ్ పోలికలు ఉండటం వల్ల అనుకుంట ఈమెతో కనెక్ట్ అయ్యాడు సల్మాన్. కానీ కొంత కాలానికి బ్రేకప్ చెప్పేసుకున్నారు
 

1012

ఫారెన్ స్టార్స్ ను కూడా వదిలిపెట్టలేదు సల్మాన్ ఖాన్. అక్కడ కూడా తన ప్రేమ జెండా పాతాడు. రోమానియా కు చెందిన లులియా తో కూడా సల్మాన్ ప్రేమాయణం నడిపాడు. అంతే కాదు జర్మన్ నటి క్లాడియా తో సల్మాన్ ఖాన్ డేటింగ్ చేశాడు. వీళ్ళు కూడా మనస్పర్థల కారణంగా బ్రేకప్ చెప్పేసుకున్నారు.
 

1112

ఇక మరో ఫారెన్ లేడీతో కూడా సల్మాన్ డేటింగ్ చేశారు. మెహెక్ చాహల్ అనే యూరోపియన్ నటి కూడా సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసింది. కొన్నాళ్ళకు ఈమె సల్మాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా ఆమె కనిపించింది. కాని వీరు ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారో మాత్రం తెలియదు. 

1212

ఇక కొంతమందితో సల్మాన్ సీక్రేట్ లవ్ నడిపినట్టు టాక్ నడిచింది. అందులో హిందీ, కన్నడ చిత్రాలతో పాపులర్ అయిన డైసీ షా తో కూడా  సల్మాన్ ఖాన్ ప్రేమ కలాపాలు నడిపించాడని టాక్. అయితే వీరిద్దరు పెద్దగా బయటపడలేదు అంతే. ఇలా ఇంకా సల్మాన్ లిస్ట్ లో మరికొంత మంది హీరోయిన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంత మందిని ప్రేమించినా.. ఎవరినీ పెళ్ళాడలేదు సల్మాన్ ఖాన్. 
 

click me!

Recommended Stories