Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?

Published : May 25, 2026, 04:18 PM IST

Aishwarya Rai: గెలుపోటములు జీవితంలో భాగం. ఈ నటుడు ఈ రోజు సినిమాకు దూరంగా ఉన్నప్పటికీ, తన కష్ట కాలాన్ని ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. ఐశ్వర్య రాయ్‌తో రొమాన్స్ చేసిన ఈ నటుడు, ఈ రోజు జీవితంతో పోరాడుతున్న తీరు సినిమా కథ కంటే భయంకరంగా ఉంది. 

PREV
15
విశ్వసుందరిగా రాణించిన ఐశ్వర్యారాయ్‌

ఐశ్వర్యా రాయ్‌ ఒకప్పుడు విశ్వసుందరిగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యింది. దాన్నుంచి ఆమె సినిమాల్లోకి వచ్చింది. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు అందరు సూపర్‌ స్టార్లతో కలిసి నటించింది. తిరుగులేని స్టార్‌ డమ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే ఈ మాజీ విశ్వసుందరితో కలిసి నటించిన ఒక స్టార్‌ హీరో ఆ తర్వాత సినిమాలు వదిలేసి మెకానిక్‌గా మారిపోయాడు, టాక్సీ కూడా నడిపించాడు. మరి ఆ స్టార్‌ హీరో ఎవరనేది చూస్తే.  

25
చాక్లెట్‌ బాయ్‌ గా పాపులర్‌ అయిన అబ్బాస్‌

90వ దశకంలో 'ప్రేమ దేశం' సినిమాతో సూపర్ స్టార్ అయిన అబ్బాస్, అమ్మాయిల కలల రాకుమారుడిగా దక్షిణాదిని ఏలాడు. అతని కెరీర్ పతాక స్థాయిలో ఉన్నప్పటి రోజులు. తిరుగులేని స్టార్‌ డమ్‌తో రాణించారు. వరుసగా అనేక సినిమాలు చేసి విజయాలు సాధించాడు. సౌత్‌ ఇండస్ట్రీని ఊపేశారు. 

35
ఐశ్వర్య రాయ్‌తో నటించిన అరుదైన నటుడు

'కండుకొండైన్ కండుకొండైన్' చిత్రంలో విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్‌కి జోడీగా నటించి, ఆమెతో స్క్రీన్ పంచుకున్న అరుదైన నటుడిగా అబ్బాస్ చరిత్ర సృష్టించాడు. వరుస ఫ్లాపులు, చేజారిన అవకాశాలతో 30 ఏళ్లు నిండకముందే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, చూస్తుండగానే అబ్బాస్ దివాళా తీశాడు.

45
మెకానిక్‌గా మారిన అబ్బాస్‌

భారత్ విడిచి న్యూజిలాండ్‌కు వెళ్లిన అబ్బాస్, కుటుంబాన్ని పోషించడానికి మెకానిక్‌గా, ట్యాక్సీ డ్రైవర్‌గా కూడా పనిచేశాడట. గతంలో ఓ ఇంటర్వ్యూలో అబ్బాస్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తనకు ఒకే జాబ్‌ చేయడం ఇష్టం లేదని, వివిధ రకాల పనులు చేయాలని ఇంట్రెస్ట్‌ ఉంటుందని, అందులో భాగంగానే మెకానిక్‌గా, టాక్సీ డ్రైవర్‌గా చేసినట్టు తెలిపారు అబ్బాయి.  ఈ క్రమంలో కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా పడినట్టు సమాచారం. ఒకప్పుడు స్టార్‌ హీరోగా, అమ్మాయిల డ్రీమ్‌ హీరోగా రాణించిన ఆయన ఇలా మారడం పట్ల ఆయన అభిమానులు షాక్‌లోకి వెళ్లారు. 

55
నటుడిగా అబ్బాస్‌ కమ్‌ బ్యాక్‌

అయితే అబ్బాయి ఇటీవల మళ్లీ సినిమాల్లోకి కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు.  ఆ మధ్య తమిళంలో జీవీ ప్రకాష్‌ కుమార్‌ హీరోగా నటించిన `హ్యాపీ రాజ్‌` మూవీలో మెరిశారు. ఇందులో ఆయన హీరోయిన్‌ తండ్రిగా కనిపించారు. తనదైన నటనతో మెప్పించారు. మంచి కమ్‌ బ్యాక్‌ ఇచ్చారని చెప్పొచ్చు.  అబ్బాస్‌ తెలుగులో చివరగా `మారో` చిత్రంలో నటించాడు. ఇందులో నితిన్‌ హీరో. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories