ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఆస్తుల విలువ దాదాపు రూ.776 కోట్లు. మరోవైపు అభిషేక్ బచ్చన్ వ్యక్తిగత సంపద రూ.280 కోట్లు. కానీ ఐశ్వర్య - అభిషేక్ బచ్చన్ ఆస్తులు కలిపి దాదాపు రూ. 1,056 కోట్లు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ దుబాయ్‌లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్‌లో విలాసవంతమైన విల్లాను కలిగి ఉన్నారు. స్విమ్మింగ్ పూల్, ఆధునిక వంటగది, ప్రైవేట్ గోల్ఫ్ కోర్స్, విశాలమైన వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. అనేక సౌకర్యాలను కలిగి ఉంది.