Aishwarya Lekshmi: సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టి లక్షలు సంపాదించే నటీనటులున్న ఈ రోజుల్లో, 100 కోట్ల రూపాయలు ఇచ్చినా సరే సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయనని సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చింది సాయిధరమ్ తేజ్ హీరోయిన్.
గాడ్సేతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయిన ఐశ్వర్య లక్ష్మి
గాడ్సే, కుమారి, అమ్ము చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది ఐశ్వర్య లక్ష్మి. ఇప్పుడు ఆమె సాయిధరమ్ మూవీలో నటిస్తుంది. `సంబరాల ఏటి గట్టు` మూవీలో నటిస్తున్న ఐశ్వర్య `గట్ట కుస్తీ 2` చిత్రంతో ఆడియెన్స్ ని ఆకట్టుకునేందుకు రాబోతుంది. సోషల్ మీడియాలోని నెగటివిటీ తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
25
సోషల్ మీడియా నుంచి ఐశ్వర్య ఎగ్జిట్
'గట్ట కుస్తీ 2' సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్, నెగటివ్ కామెంట్స్ రావడంతో ఆమె తన అకౌంట్‌ను డిలీట్ చేశారట. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా స్పందించింది ఐశ్వర్య లక్ష్మి. ఎందుకు సోషల్ మీడియా నుంచి తప్పుకుందో వెల్లడించింది.
35
నెగటివిటీ నుంచి దూరంగా ఉండేందుకే
ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ, `సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ వచ్చేవి. దానివల్ల బయట జనాలు నాతో మాట్లాడే తీరు కూడా మారింది. ఇప్పుడు సోషల్ మీడియా లేకుండా చాలా ప్రశాంతంగా, హాయిగా ఉన్నాను. వంద కోట్లు ఇచ్చినా మళ్లీ సోషల్ మీడియాలోకి రాను` అని చెప్పింది.
"సోషల్ మీడియాలో నాకు సేఫ్‌గా అనిపించలేదు. నా శరీరం గురించి మాట్లాడేవారు, ఫొటోలు మార్ఫింగ్ చేసేవారు, జడ్జ్ చేసేవారు. ఒక్క నెగటివ్ కామెంట్ వచ్చినా, జనాలు నన్ను ద్వేషిస్తున్నారని అనిపించేది. దానివల్ల సిగ్గుగా, ఇబ్బందిగా ఉండేది. ఎవరైనా కలిసినా, వాళ్లతో మాట్లాడకుండా త్వరగా వెళ్లిపోయేదాన్ని" అని ఐశ్వర్య లక్ష్మి తెలిపింది.
55
ఇన్‌స్టాగ్రామ్‌కు దూరమవడం బాధగానే ఉంది, కానీ
"ఇన్‌స్టాగ్రామ్‌కు దూరంగా ఉంటే, జనాల మనసులకు కూడా దూరమైనట్టే. కానీ నాలోని కళాకారిణి కోసం, నాలోని చిన్నపిల్ల కోసం ఇదంతా చేస్తున్నాను" అని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగు మూవీతోపాటు బాలాజీ మోహన్ దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్ 'లవ్' సిరీస్‌లో అర్జున్ దాస్‌తో కలిసి నటిస్తుంది. ఆనంద్ దర్శకత్వంలో ఓ తమిళ పీరియడ్ సినిమాలో పోలీస్ అధికారి పాత్ర కూడా చేస్తుంది. సతీష్ రాజా ధర్మర్ డైరెక్షన్‌లో 'తీవినై పొట్రు', 'ఆశా' అనే మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది ఐశ్వర్య లక్ష్మి.