పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ టూర్లు, పొలిటికల్ మీటింగ్స్, తన చిత్రాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో ఉదయ్ పూర్ వెళ్లారు. అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లి పొలిటికల్ మీటింగ్స్ లో పాల్గొన్నారు. అనంతరం తిరిగొచ్చి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్ ప్రారంభించారు.