పూనమ్ పాండేకు బిగ్ షాక్.. 100 కోట్లు కట్టాల్సిందేన...?

పూనం పాండేకు గట్టి షాక్ తగిలింది. ఆమె చేసిన పనికి 100 కోట్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ బ్యూటీ ఇంతకీ ఏం చేసిందంటే...? 

Poonam Pandey

బాలీవుడ్ లో ఈమధ్య హాట్ టాపిక్ గా మారింది పూనమ్ పాండే.. ఎన్నో విమర్శలకు కారణం అయ్యింది.  సర్వైకల్‌ క్యాన్సర్‌ తో చనిపోయినట్లు నటించి..  సోషల్‌ మీడియాతో పాటు ఆడియన్స్ ను ఫూల్స్ ను చేసింది బాలీవుడ్ నటి మోడల్ పూనమ్ పాండే. సర్వికల్ క్యాన్సర్ అవేర్ నెస్ కోసమే ఇలా చేశానంటూ.. వివరణ కూడా ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ. కాని ఆమె చేసిన పనికి నెట్టింట విమర్షల వాన కురిసింది. దారుణంగా తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. 

కొంత మంది మాత్రం ఆమెకు సపోర్ట్ గా నిలుచున్నారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్ పూనమ్ పాండేకు.. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా మద్దతు ప్రకటించారు. ఇక ఈ వివాదం ఇంకా పూర్తి కాలేదు.. ఆమెపై ఇంకా కోనపంగానే ఉన్నా బాలీవుడ్ జనాలు. కాగా ఈ ఇష్యూపై రియాల్టీ షో డేటింగ్ బాజీ ఫేమ్ ఫైజాన్ అన్సారీ..  స్పందించడంతో పాటు.. వారిపై పరువునష్టం దావా వేశారు. 


పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై అతను 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీంతో సీపీ అఖిల్ కుమార్ ఈ కేసుపై పూనమ్ దంపతులను విచారణకు ఆదేశించారు.ఈ మేరకు సీపీ విచారణను ఫైల్ఖానా ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించగా.. ఫైజాన్ అన్సారీ కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నట్లు తెలిపారు. ఈ విషయన్ని చాలా సీరియస్ గా తీసుకున్న వారు.. పూనమ్ పాండే విమర్శలతో విరుచుకుపడ్డారు. 

పూనమ్ పాండే  దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఫైజాన్ ఆరోపించారు. ఆమె సజీవంగా ఉండి కూడా చనిపోయిన్టు ప్రచారం చేసి.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారని.. బాలీవుడ్ నటిగా ఆమెనుఅభిమానించేవారి మనోవేదనకు కూడా కారణం అయ్యిందని అన్నారు. అంతే కాదు సర్వికల్ క్యాన్సర్ తో బాధపడే ఇతరులు కూడా .. ఈ వార్తలతో భయానికి గురయ్యారని తెలిపారు.. 

ఇలా మరవణ వార్త ప్రచారం చేయడం దారుణం అన్నారు. ‘పూనమ్ చనిపోయిందని ఆమె మేనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సమాచారం మోడల్ యొక్క అధికారిక ఇన్ స్టా హ్యాండిల్ నుండి పోస్ట్ చేయడంతో అది నిజమే అని అందరూ అనుకున్నారు. ఆమె యూపీ లోని కాన్పూర్ నివాసి అని కూడా ప్రచారం జరిగింది.

Poonam pandey

కానీ వాస్తవానికి ఆమె ముంబైలో పుట్టి అక్కడే చదువుకున్నారు. ఆమె తల్లిదండ్రులు కూడా ముంబై వాసులే’ అని పైజాన్ తెలిపారు. గతంలోనూ ముంబైలో ఉర్ఫీ జావేద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఫైజాన్ అన్సారీనే ఇప్పుడు పూనమ్ పాండే మీద పరువు నష్టం దావా వేశారు. తప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం పూనమ్ పాండే ఇలాంటి పని చేస్తూనే ఉందని ఆయన మండిపడ్డారు.

Latest Videos

click me!