Rashmika Mandanna : హిట్టు పడిందో లేదో.. అప్పుడే రేటు పెంచేసిన రష్మిక.. ఎంత తీసుకుంటుందో తెలుసా..?

First Published | Jan 10, 2022, 8:35 AM IST

ఇలా హిట్టు పడిందో లేదో అలా రేటు పెంచేసింది కన్నడ కస్తూరి రష్మిక మందన్న(Rashmika Mandanna).దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంది స్టార్ బ్యూటీ. చేతినిండా ఎడా పెడా సంపాదించేస్తోంది.

అసలే హీరోయిన్ ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ఎప్పుడు అవకాశాల తగ్గుతాయో చెప్పలేం. కొత్త నీరు వస్తే.. పాత నీరు వెళ్లిపోయినట్టు.. కొత్త హీరోయిన్ కాస్త బాగుంటే చాలు.. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా పక్కకు జరగాల్సిందే. అందుకే స్టార్ డమ్ ఉన్నప్పుడే సంపాదించేసుకోవాలి అనకుంటున్నారు హీరోయిన్లు. అలాంటివారిలో  స్టార్ హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna) కూడా చేరిపోయింది.

ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం రష్మిక మందన్న(Rashmika Mandanna).. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) జతగా నటించిన గీతగోవిందం సినిమాతో ఒక్క సారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాతోనే స్టార్ డమ్ కూడ తెచ్చుకుంది. ఆతరువాత వరుస సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లో సెట్ అయ్యింది రష్మిక. స్టార్ హరోల సరసన వరుస అవకాశాలు కొట్టేస్తుంది.


తన నటనతో వయ్యారాలతో.. తెలుగు ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్న రష్మిక(Rashmika Mandanna).. క్యూట్ ఎక్స ప్రెషన్స్ తో కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఒక్క సారిగా రష్మిక స్టార్ డమ్ పెరిగిపోయింది. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు అటు బాలీవుడ్ నుంచి కూడా రష్మికను వరించాయి. దాంతో నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక.

వరుస సినిమాలతో సందడి చేస్తున్న రష్మిక అటు బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేసింది. మిషన్ మజ్నూతో పాటు గుడ్ బై సినిమాలలో నటించింది. మరికోన్ని బాలీవుడ్ ఆఫర్లు కూడా రావడంతో.. టాలీవుడ్ నుంచి మకాం బాలీవుడ్ కు మార్చేస్తుందట రష్మిక. ఈ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) జోడీగా అలరించింది రష్మిక. 5 భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఈ హీరోయిన్ కెరీర్ కు బాగా ప్లస్ అయ్యింది. బాలీవుడ్ లో రష్మిక ఇమేజ్ అమాంతం పెరిగింది.

పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతున్న పుష్ప మూవీ.. సూపర్ హిట్ తో రష్మిక డిమాండ్ పెరిగిపోయింది. అన్ని భాషలల్లో తన ఇమేజ్ పెరిగిపోవడంతో.. ఆ ఇమేజ్ ను ఉపయోగించుకుని రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట కన్నడ భామ. ఇంతకు ముందు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క.. ఆఫ్టర్ పుష్ప.. తగ్గేదే లే అంటుందట రష్మిక మందన్న (Rashmika Mandanna)

ప్రస్తుతం పుష్ప మూవీ వరకు 2 కోట్లు తీసుకుంటున్న రష్మిక మందన్న(Rashmika Mandanna) పుష్ప మూవీ హిట్ తో.. తరువాతి సినిమాలకు 3 కోట్లు డిమాండ్ చేస్తుందట. ఇక చిన్న చితకా హీరోలతో పనిలే.. స్టార్ హీరో సినిమా అయితేనే చేస్తానంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ముందుగానే కమిట్ అయిన ఆడావాళ్ళు మీకు జోహార్లు తరువాత రష్మిక చిన్న హీరోల పక్కన నటించదని టాక్. ఈసినిమాలో శర్వానంద్ జోడీగా రష్మిక నటించింది. ఇక ఏ సినిమా అయినా.. ఆమెకు 3 కోట్లు సమర్పించుకోవల్సిందే.

ప్రస్తుతం ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్న రష్మిక బాలీవుడ్ లో మిషన్ మజ్ను,గుడ్ బై మూవీస్ చేసింది. ఈ సినిమాలు రిలీజ్ కావల్సి ఉంది. ఇక పుష్ప పార్ట్ 2 తో పాటు టాలీవుడ్  మరికొన్ని సినిమా ప్రపోజల్స్ ఉన్నాయి.అయితే  ఓ స్టార్ హీరో సినిమాను రిజక్ట్ చేసిందని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. బాలీవుడ్ కు మకా పూర్తిగా మార్చేయాలనే ప్లాన్ లో ఉందట రష్మిక మందన్న(Rashmika Mandanna).

Latest Videos

click me!