నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ అనంతరం విడుదలవుతున్న శోభిత ధూళిపాళ్ల కొత్త చిత్రం!

First Published | Sep 11, 2024, 5:17 PM IST

నాగ చైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల కొత్త చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధం అవుతుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లవ్, సితార ఎలా ఉండనుంది. 
 

హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల త్వరలో అక్కినేని వారి ఇంటి కోడలు కానుంది. హీరో నాగ చైతన్యతో ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ క్రమంలో శోభిత నటించిన లవ్, సితార చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రంలో రాజీవ్ సిద్ధార్థ్, సోనాలీ కులకర్ణి సైతం ప్రధాన పాత్రలు చేశారు. లవ్, సితార చిత్రానికి వందన కటారియా దర్శకుడు.

Sobhita Dhulipala

లవ్, సితార రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్. లవ్, సితార చిత్రాన్ని నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేశారు. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ జీ 5లో సెప్టెంబర్ 27 నుండి లవ్, సితార అందుబాటులోకి రానుంది. శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్ర చేసిన నేపథ్యంలో తెలుగు ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 


Sobhita Dhulipala

లవ్, సితార శోభిత ధూళిపాళ్ల చివరి చిత్రం కావచ్చని సమాచారం. ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేసిన దాఖలాలు లేవు. నాగ చైతన్యతో పెళ్ళికి సిద్ధం కాగా, శోభిత ధూళిపాళ్ల చిత్రాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నారనే పుకార్లు ఉన్నాయి. శోభిత ధూళిపాళ్ల 2016లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గతంలో ఆమె మోడల్ గా వ్యవహరించారు. పలు వ్యాపార ప్రకటనల్లో శోభిత నటించారు. 
 

రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. అనంతరం కాలకాండీ, చెఫ్ వంటి హిందీ చిత్రాల్లో నటించింది. గూఢచారి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు శోభిత పరిచయమైంది. అడివి శేష్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ గూఢచారి హిట్ టాక్ తెచ్చుకుంది. అడివి శేష్ నటించిన మరొక చిత్రం మేజర్ లో సైతం శోభిత కీలక రోల్ చేయడం విశేషం. 


హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ లో శోభిత వేశ్య పాత్ర చేసింది. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్ హీరోగా నటించారు. శోభిత ధూళిపాళ్ల వ్యక్తిగత సమాచారం పరిశీలిస్తే... ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా, తెనాలిలో పుట్టింది. వైజాగ్, ముంబైలో చదువుకుంది. అనంతరం మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది.

Actress Sobhita dhulipala

రెండేళ్లకు పైగా నాగ చైతన్యతో ఆమె రిలేషన్ లో ఉంది. శోభిత-నాగ చైతన్య జంటగా విహరిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కొన్ని ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. శోభిత ఎఫైర్ రూమర్స్ ని ఖండించడం విశేషం. అనూహ్యంగా ఆగస్టు 8వ తేదీన నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇరు కుటుంబాల సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2025 ఫిబ్రవరిలో వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాగా నాగ చైతన్య హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్నారు. 2021లో మనస్పర్థలతో వీరు విడిపోయారు.  

Samantha

మరోవైపు సమంత సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. ఇటీవల ఆమె పై ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శక ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉన్నారంటూ కథనాలు ప్రచురించారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. 

Latest Videos

click me!