ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే కాగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది సమంత. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో అఖిల్ ఫోటో షేర్ చేసి బెస్ట్ విషెస్ చెప్పింది. దాంతో అఖిల్ పై సమంతకు ఉన్న అభిమానం, స్నేహం బయటపడ్డాయి. నాగ చైతన్యను వ్యతిరేకిస్తున్న సమంత, అఖిల్ తో మాత్రం టచ్ లోనే ఉంటుందనే విషయం వెలుగులోకి వచ్చింది.