నా భార్య ప్రమాదంలో చనిపోలేదు త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ భర్త కీలక కామెంట్స్!

Published : May 15, 2024, 03:03 PM IST

ఇటీవల త్రినయని ఫేమ్ పవిత్ర జయరామ్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. అయితే పవిత్ర జయరామ్ మరణానికి ప్రమాదం కారణం కాదని ఆమె భర్త కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వెల్లడించాడు...   

PREV
16
నా భార్య ప్రమాదంలో చనిపోలేదు త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ భర్త కీలక కామెంట్స్!
Pavithra Jayaram

కన్నడ నటి పవిత్ర జయరామ్ అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచిపోయారు. త్రినయని సీరియల్ లో మెయిన్ విలన్ గా చేస్తున్న త్రినయని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. త్రినయని సూపర్ హిట్ సీరియల్ కావడంతో పవిత్ర జయరామ్ కి జనాల్లో క్రేజ్ వచ్చింది. 
 

26
Pavithra Jayaram

సోమవారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పవిత్ర జయరామ్ అక్కడిక్కకే మరణించగా.. కుటుంబ సబ్యులకు గాయాలు అయ్యాయి. అయితే పవిత్ర జయరామ్ కారు ప్రమాదంలో మరణించలేదన్న చేదు వార్తను ఆమె భర్త చంద్రకాంత్ బయటపెట్టాడు. 
 

36
Pavithra Jayaram

చంద్రకాంత్ ప్రమాదం జరిగిన రోజు ఏమైందో చెప్పుకొచ్చాడు. బెంగుళూరులో వర్షం పడటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అనుకున్న సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరాము. మెహబూబ్ నగర్ చేరుకునే సమయానికి అర్ధరాత్రి అయ్యింది. 12:30 గంటల ప్రాంతంలో ఓ ఆర్టీసీ బస్సు ఎడమవైపు నుండి ఓవర్ టేక్ చేసింది.

46
Pavithra Jayaram

దాంతో డ్రైవర్ కుడివైపుకు తిప్పాడు. కారు డివైడర్ ని ఢీ కొట్టింది. అప్పుడు కారులో పవిత్ర, నేను, కూతురుతో పాటు మరో అమ్మాయి ఉంది. నాకే దెబ్బలు తగిలాయి. పవిత్ర నన్ను చూసి షాక్ కి గురైంది. వెంటనే ఆమెకు హార్ట్ అటాక్ వచ్చింది. దెబ్బల కారణంగా నేను స్పృహ కోల్పోయాను. 
 

56
Pavithra Jayaram

ఆసుపత్రికి చేరే సరికి ఒంటి గంట అయ్యింది. నాకు తెల్లవారుఝామున 4 గంటలకు మెలకువ వచ్చింది. అప్పటికే పవిత్ర మరణవార్త నాకు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సు కి కాల్ చేశాము. అది అందుబాటులో లేదు. అంబులెన్సు వచ్చి ఉంటే... పవిత్రను కాపాడుకునేవాళ్ళం.. అని ఎమోషనల్ అయ్యాడు. 
 

66
Pavithra Jayaram

చంద్రకాంత్ భార్య పవిత్ర జయరామ్ మరణం అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. నీతో దిగిన చివరి ఫోటో ఇది. నువ్వు లేవన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఒకసారి మామ అని పిలువు, అని కామెంట్స్ జోడించాడు. 
 

click me!

Recommended Stories