ప్లాటినమ్‌ కలర్‌ శారీలో శ్రీముఖి మతిపోయే పోజులు.. స్లిమ్‌ లుక్‌లో బుల్లితెర రాములమ్మ రచ్చ నెక్ట్స్ లెవల్‌

Published : May 15, 2024, 02:45 PM IST

బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో అత్యంత బిజీ యాంకర్‌గా రాణిస్తుంది. ఆమె చేతిలో నాలుగైదు షోస్‌ ఉన్నాయి. తనదైన ఎనర్జిటిక్‌ యాంకరింగ్‌తో షోస్‌ని రక్తికట్టిస్తుంది శ్రీముఖి.   

PREV
110
ప్లాటినమ్‌ కలర్‌ శారీలో శ్రీముఖి మతిపోయే పోజులు.. స్లిమ్‌ లుక్‌లో బుల్లితెర రాములమ్మ రచ్చ నెక్ట్స్ లెవల్‌

శ్రీముఖి ఎంతో స్ట్రగుల్‌ అయి యాంకర్‌గా నిలబడింది. ఆమె అందం, చలాకీతనం, ఎనర్జిటిక్‌ యాంకరింగ్‌ ఆమెకి ప్లస్‌ అయ్యాయి. అవి షోస్‌ రక్తికట్టడంలో ప్రధాన భూమిక పోషించాయి. ఈ క్రమంలో శ్రీముఖి షోస్‌ మోస్ట్ ఎంటర్‌టైనింగ్‌గా మారడం విశేషం. 
 

210

యాంకర్‌ శ్రీముఖి `అదుర్స్‌` షోతో కెరీర్‌ని ప్రారంభించింది. అంతకు ముందు నటిగా మెప్పించే ప్రయత్నం చేసింది. హీరోయిన్లకి ఫ్రెండ్‌గా మెరిసింది. సైడ్‌ క్యారెక్టర్స్ తో అలరించింది. 
 

310

సినిమాల్లో శ్రీముఖికి గుర్తింపు రాలేదు. ఆమె ఎంత ప్రయత్నం చేసినా అక్కడ గుర్తింపుకి నోచుకోలేకపోయింది. తెరపై కాసేపు కనిపించినా, వ్యక్తిగతంగా ఆమెకి ప్లస్‌ కాలేదు. 
 

410

సినిమా ఆఫర్లు కూడా చాలా తక్కువగా వచ్చాయి. అవి కూడా ఒకటి అర అన్నట్టుగానే మారాయి. ఈనేపథ్యంలో ఆమె టర్న్ తీసుకుంది. సినిమాలు వదిలేయకుండానే బుల్లితెరపై ఫోకస్‌ పెట్టింది. 
 

510

యాంకరింగ్‌ కి సంబంధించి గట్టి ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఆమె `అదుర్స్` షోతో యాంకర్‌గా కెరీర్‌ ని ప్రారంభించింది. షో మంచి ఆదరణ పొందింది. కానీ శ్రీముఖికి రావాల్సిన పేరు రాలేదు. 

610

కానీ ఆమెకి అదొక విజిటింగ్‌ కార్డ్ లా పనిచేసింది. `మంకీ మంకీ` షోతోనూ నవ్వులు పూయించింది. `సూపర్‌ మామ్‌` షో కూడా బాగానే అనిపించింది. ఈ క్రమంలో `పటాస్‌` షో ఆమెకి పెద్ద గుర్తింపుని తీసుకొచ్చింది. 
 

710

ఈ షోస్‌తో శ్రీముఖి దశ తిరిగిపోయింది. ఈ క్రమంలో `సూపర్‌ సీరియల్‌ ఛాంపియన్‌షిప్‌`, `సూపర్‌ సింగర్‌`, `జూలకటక`, `భలే ఛాన్స్ లే`, `సరిగమప`, `గోల్డ్ రష్‌`, `స్టార్ట్ మ్యూజిక్‌ రీ లోడెడ్‌`, `బొమ్మ అదిరింది` షోస్‌ పడ్డాయి. దీంతో యాంకర్‌గా తన రేంజ్‌ని పెంచుకుంది. 
 

810

ఆ మధ్య కొంత గ్యాప్‌ వచ్చింది. కానీ స్ట్రాంగ్‌గా కమ్‌ బ్యాక్‌ అయ్యింది. కరోనా తర్వాత శ్రీముఖి లైఫ్‌ టర్న్ తీసుకుంది. వరుసగా షోస్‌ వచ్చిపడ్డాయి. `కామెడీ స్టార్స్`, `జీ మహోత్సవం`, `అలా బృందావనంలో`తో అలరిచింది. కానీ కామెడీ స్టార్స్ మంచి పాపులారిటీని తీసుకొచ్చింది. 
 

910

`చెఫ్‌ మంత్ర`, `సరిగమప`, `డాన్స్ ఐకాన్‌`, `అదివారం స్టార్‌ మా పరివారం`, `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌`, `సారంగ దరియా` వంటి షోస్‌ చేస్తూ వచ్చింది, తెలుగులో అత్యంత బిజీ యాంకర్‌గా మారింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ షోస్‌ కంటిన్యూ చేస్తూ రాణిస్తుంది. 

1010

దీంతోపాటు `నీతోనే డాన్స్` షోకి కూడా యాంకర్‌గా చేస్తుంది. తాజాగా ఈ షోకోసం ఆమె కొత్త డ్రెస్‌లో ముస్తాబై ఆకట్టుకుంది. ప్లాటినమ్‌ కలర్‌ శారీలో మెరిసింది. తన అందాలకు ప్లాటినమ్‌ పూత పోసినట్టుగా ఉన్న చీర కట్టి మంత్రముగ్దుల్ని చేస్తుంది. కాస్త స్లిమ్‌ లుక్‌లో మెరుస్తూ మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories