అనసూయను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. రెండు రోజులుగా ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మీమ్స్ క్రియేట్ చేసి అనసూయను ఉడికించే ప్రయత్నం చేస్తున్నారు. అనసూయ కూడా అసలు తగ్గడం లేదు. తనను ట్రోల్ చేసేవారికి సమాధానం చెబుతూ ట్విట్టర్ లోనే తిష్ట వేశారు. అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సీరియస్ వార్ నడుస్తుండగా మధ్యలో శ్రద్దా దాస్ వచ్చి వేలు పెట్టారు.