'రేసు గుర్రం' విలన్ ఇలా ఇరుక్కుపోయాడేంటి? వేరే ఆమెతో రిలేషన్, బిడ్డ కూడా...కోర్టుకి

Published : Apr 17, 2024, 10:10 AM IST

తండ్రి ప్రేమకు నేను చిన్నతనం నుంచి దూరమయ్యాను. ఇప్పుడు నాకు తండ్రి ప్రేమ కావాలి. అందుకే కోర్టులో కేసు వేద్దామనుకుంటున్నాను

PREV
110
 'రేసు గుర్రం' విలన్ ఇలా ఇరుక్కుపోయాడేంటి? వేరే ఆమెతో రిలేషన్, బిడ్డ కూడా...కోర్టుకి
Actor Ravi kishan


 అల్లు అర్జున్‌ రేసుగుర్రం సినిమాలో విలన్ మద్దాలి శివారెడ్డిగా చేసిన రవికిషన్ గుర్తుండే ఉండి ఉంటారు.   భోజ్‌పురి సినిమాల్లో స్టార్ గా వెలిగిన ఆయన తెలుగులో విలన్ గా చేసి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేసారు. రేసుగుర్రం సినిమా తర్వాత కిక్-2, సుప్రీం, లై ఇలా వరుస చిత్రాలతో .. తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుని. టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు రవి కిషన్. ఇక ప్రస్తుతం రవి కిషన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే అదే సమయంలో ఓ వివాదంలో ఇరుక్కుపోయారు. 

210


 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ గోరఖ్‌పుర్‌ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు రవికిషన్ . తాజా ఎన్నికల్లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రముఖ భోజ్‌పురి నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రవికిషన్‌ కు సినిమా అభిమానులు ఉండటంతో ఆయన రాజకీయాల్లో బాగానే రాణిస్తున్నారు.  అయితే లోక్ సభ ఎన్నికల ముందు ఆయనకు భారీ షాక్ తగిలింది. 
 

310
Gorakhpur MP and actor Ravi Kishan


ఒక మహిళ తాను రవికిషన్ భార్యనే అంటూ మీడియా ముందుకు వచ్చారు. తన కూతురిని రవికిషన్ స్వీకరించాలంటూ ఆ మహిళ కామెంట్లు చేసున్నారు. రవికిషన్ చాలా సంవత్సరాల క్రితమే ప్రీతి కిషన్ అనే మహిళతో పెళ్లి కాగా ఈ దంపతులకు రివా కిషన్ అనే కూతురు ఉంది.

410
Pawan Singh and Khesari Lal Yadav


 అపర్ణా ఠాకూర్ అనే మహిళ తాను రవికిషన్ భార్యనే అంటూ మీడియా ముందుకు వచ్చారు. 1996 సంవత్సరంలో తనకు, రవికిషన్ కు పెళ్లి జరిగిందని పాప కూడా పుట్టిందని అపర్ణ పేర్కొన్నారు. రవికిషన్ ఇప్పటికీ తనతో టచ్ లో ఉన్నాడని ఆమె చెబుతున్నారు. మహిళ ఆరోపణల వల్ల రవికిషన్ పొలిటికల్ కెరీర్ చిక్కుల్లో పడుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

510


 అపర్ణ ఠాకూర్ కూతురు మాట్లాడుతూ రవికిషన్ నా తండ్రి అని నాకు 15 ఏళ్లు వచ్చిన తర్వాతే తెలిసిందని చెప్పుకొచ్చారు. గతంలో ఆయనను అంకుల్ అని పిలిచేదానినని అపర్ణ కూతురు వెల్లడించారు. నా ప్రతి పుట్టినరోజుకు రవికిషన్ మా ఇంటికి వచ్చేవారని ఆయన ఫ్యామిలీని నేను కూడా ఒకసారి కలిశానని ఆమె పేర్కొన్నారు.

610


తండ్రిగా చూస్తే మాత్రం ఆయన నా దగ్గర ఎప్పుడూ లేరని నన్ను కూతురిగా స్వీకరించాలని ఆయనను కోరుతున్నానని కోర్టులో కేసు వేద్దామని అనుకుంటున్నానని అపర్ణ కూతురు అన్నారు. అపర్ణ కూతురు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

710


తండ్రి ప్రేమకు నేను చిన్నతనం నుంచి దూరమయ్యాను. ఇప్పుడు నాకు తండ్రి ప్రేమ కావాలి. అందుకే కోర్టులో కేసు వేద్దామనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో కూడా ప్రకంపనలు పుట్టిస్తోంది. మరి ఈ ఆరోపణలపై రవికిషన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. 

810
Ravi Kishan


అలాగే ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు జంటగా నటించి గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నగ్మాతో (Nagma) ఆయన ఎఫైర్ నడిపారనే రూమర్స్ ఉన్నాయి. వీరిద్దరూ భోజ్‌పురిలో అనేక చిత్రాల్లో జంటగా నటించారు. అయితే,  ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో రవికిషన్‌కు ఇదే ప్రశ్న ఎదురవగా.. తమ రిలేషన్‌షిప్ గురించి రివీల్ చేశారు.

910

‘నగ్మాతో కలిసి తాను ఎక్కువ సినిమాలు చేయడం వల్లే ఈ తరహా రూమర్లు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా ఆమెతో చేసిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. మొదటి నుంచి తాము మంచి ఫ్రెండ్స్ కావడం వల్లే ఎక్కువ సినిమాలు చేయగలిగాం. కానీ నాకు అప్పటికే పెళ్లయ్యింది. పైగా నా భార్యను నేను చాలా గౌరవిస్తా. ఇప్పటికీ ఆమె కాళ్లు మొక్కుతుంటా. ఎందుకంటే నా జీరోగా ఉన్నప్పటి నుంచి కూడా తను నాతోనే ఉంది. 
 

1010
Ravi Kishan


అయితే వరుస సక్సెస్‌లు సాధించిన తర్వాత నేను చాలా గర్వాన్ని ప్రదర్శించాను. అదే టైమ్‌లో బిగ్‌ బాస్‌ రియాలిటీ షోకు వెళ్లాల్సిందిగా తను సూచించింది. నిజానికి అయిష్టంతో వెళ్లాను. కానీ 3 నెలలు హౌజ్‌లో గడిపిన తర్వాత నాలో చాలా మార్పొచ్చింది. నేను మరింత పాపులర్ కావడమే కాకుండా వ్యక్తిగా ఎంతో మారిపోయా. అప్పటి నుంచి నా భార్యా పిల్లలను బాగా చూసుకుంటున్నా’ అని తెలిపారు రవికిషన్‌.

Read more Photos on
click me!

Recommended Stories