`మగాళ్లు మ్యాగీ రెండు నిమిషాలే` అన్న రెజీనాని అందరి ముందే స్టేజ్‌పైన ఓ రేంజ్‌లో ఆడుకున్న అడవిశేష్‌..

Published : Sep 14, 2022, 08:19 PM ISTUpdated : Sep 14, 2022, 08:20 PM IST

హాట్‌ హీరోయిన్‌ రెజీనా ఇటీవల బోల్డ్ కామెంట్స్ చేసింది. మగాళ్లు, మ్యాగీ రెండు నిమిషాలే అంటూ షాకిచ్చింది. ఈ వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో తాజాగా అడివి శేష్‌ ఈ విషయంపై ఆమెని నిలదీయడం విశేషం.   

PREV
16
`మగాళ్లు మ్యాగీ రెండు నిమిషాలే` అన్న రెజీనాని అందరి ముందే స్టేజ్‌పైన ఓ రేంజ్‌లో ఆడుకున్న అడవిశేష్‌..

రెజీనా, నివేదా థామస్‌ కలిసి నటించిన `శాకిని డాకిని` చిత్రం ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ వీడియోలో మగవాళ్లపై ఓ పెద్ద జోకుంది అంటూ రెచ్చిపోయింది రెజీనా. మగవాళ్లు, మ్యాగీ రెండు నిమిషాలే అంటూ వ్యాఖ్యానించింది. ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. అనేక ట్రోల్స్ కి, మీమ్స్ కి కారణమయ్యాయి. తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. 
 

26

అదే సమయంలో ఆమెని నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేశారు. `నీ కంటికి మగాళ్లు అంత చులకనగా కనిపిస్తున్నారా` అంటూ మండిపడుతున్నారు. రెజీనా వ్యవహారం మామూలుగా లేదుగా అంటూ తమదైన స్టయిల్‌లో కౌంటర్లిస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకెళ్లి పచ్చిగా కామెంట్లు పెడుతుండటంతో ఇది పెద్ద రచ్చ అవుతుంది. టాలీవుడ్‌లో చర్చనీయాంశంగానూ మారింది. 
 

36

ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై అడివి శేష్‌ స్పందించడం విశేషం. అంతేకాదు అందరి ముందు రెజీనాని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. `శాకిని డాకిని` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గెస్ట్ గా పాల్గొన్నాడు అడవి శేష్‌. ఆయన సినిమా గురించి, రెజీనా, నివేదా గురించి మాట్లాడారు. నిర్మాత సునీతా తాటికి క్షమాపణలు కూడా చెప్పారు. సినిమా సక్సెస్‌ కావాలని, థియేటర్లో ఫస్ట్ రోజు తాను చూస్తానని తెలిపారు. ఇద్దరమ్మాయిలు ఇలాంటి సాహసోపేతమైన సినిమా చేయడం గొప్ప విషయమని అన్నారు. 

46

అంతటితో ముగిస్తుండగా, యాంకర్‌ ఇంకాస్త ఏదైనా కావాలని, మీమ్స్ కి, థంబ్‌ నెయిల్‌కి స్టఫ్‌ దొరకడం లేదంటూ వ్యాఖ్యానించింది. దీంతో అడివి శేష్‌.. రెజీనా అన్న డైలాగ్‌లను ప్రస్తావించారు. `రెజీనా ఈ మధ్యన ఏదో,, మ్యాగీస్‌, మగవాళ్లు అని ఏదో అంటున్నావట.. ఎందుకడుగుతున్నానంటే నందుకూడా తిడుతుంది. ఎక్కువ కాలం సినిమాలు తీస్తుంటావు, నాకు స్టామినా ఎక్కువ అని అంటుంటుంది. ఏంటీ మ్యాగీస్‌తో పెట్టి మగవాళ్లని తిడుతున్నావట అంటూ స్టేజ్‌పైనే నిలదీశాడు అడివిశేష్‌.
 

56

దీనికి స్పందించాలని కోరగా, రెజీనా రెండు నిమిషాల్లో చెబుతా అంటూ ఆ సమాధానం డాట వేసే ప్రయత్నం చేసింది. అసలు విషయం చెప్పకుండా తప్పించుకుంది. టూ మినిట్స్ లో చెప్పు అని మళ్లీ అడిగినా, ఆమె కూడా టూ మినిట్స్ లోనే చెబుతా అంటూ కవర్‌ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

66

మొత్తంగా రెజీనా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. చాలా రోజుల తర్వాత ఆమె మరోసారి చర్చనీయాంశంగా మారింది. రెజీనా చివరగా మూడేళ్ల క్రితం `ఎవరు` సినిమాతో మెరిసింది. అడివి శేష్‌తోనే కలిసి నటించింది. ఇటీవల `ఆచార్య`లో ఐటెమ్ సాంగ్‌ చేసింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత వెండితెరపై ఆకట్టుకునేందుకు వస్తుందీ హాట్‌ సోయగం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories